విజయవాడలో వైసిపి నిరాహారదీక్షా శిబిరంపై బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో టిడిపి కార్యకర్తల దాడి గర్హనీయం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 ఆగష్టు, 2026.

విజయవాడలో వైసిపి నిరాహారదీక్షా శిబిరంపై

బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో టిడిపి కార్యకర్తల దాడి గర్హనీయం

డిఎస్సీలో అవినీతిపై వైసిపి నేతలు, కార్యకర్తలు విజయవాడలో ఆందోళన చేస్తుండగా టిడిపి శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో టిడిపి కార్యకర్తలు దాడి చేసి దీక్షా శిబిరాన్ని తొలగించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కతమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. అధికార పార్టీ ఇలాంటి దాడులకు పూనుకోవడం పాలనా వ్యవస్థనే ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసే హక్కును హరిస్తూ, టిడిపి దౌర్జన్యం చేయటం తగదు. పోలీసుల సమక్షంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నా, నివారించకపోగా వైసిపి నేతలను అరెస్టు చేయటం దుర్మార్గం. ఇటువంటి దాడులను నివారించాల్సిన ప్రభుత్వం, టిడిపి అధిష్టానం సమర్ధించుకునే రీతిలో వ్యవహరించటం సరికాదు. దాడి చేసిన బోండా ఉమామహేశ్వరరావు, టిడిపి నేతలపై కేసులు నమోదు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి