
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 ఆగష్టు, 2026.
అర్జున అవార్డు పొందిన తెలుగు తేజాలకు అభినందనలు
2025 క్రీడలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డులకు ఎంపికయిన పుల్లెల గాయత్రి (బ్యాట్‌మెంటెన్), ధనుష్ శ్రీకాంత్ (పారా షూటింగ్)లకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది.
ధనుష్ శ్రీకాంత్ వినికిడి సమస్య ఉన్నా దానిని లోపంగా భావించకుండా మూడు స్వర్ణ పథకాలు సాధించి క్రీడా రంగంలో ఈ స్థాయికి ఎదిగి, ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచారు. పుల్లెల గాయత్రీ - ట్రీషా జాలే జోడిగా అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలకు గాను ఈ అవార్డులకు ఎంపికవ్వడం హర్షణీయం. ప్రభుత్వాలు నిధులు కేటాయించి గ్రామ స్థాయి నుండి క్రీడా కారులను ప్రోత్సహిస్తే మరెంతమందో ఆణిముత్యాలు లాంటి వారు మరిన్ని విజయాలు సాధిస్తారు.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
