పాడేరులో ఆదివాసీ బిడ్డల, తల్లిదండ్రుల అరెస్టుకు సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 ఆగష్టు, 2026.

పాడేరులో ఆదివాసీ బిడ్డల, తల్లిదండ్రుల అరెస్టుకు 

సిపిఐ(యం) ఖండన

విశాఖ మారిక వలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్దరించాలని కోరుతూ పాడేరులో గత 20 రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు బలవంతంగా అరెస్టు చేసి, టెంట్ పీకేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. రేపు ముఖ్యమంత్రి అల్లూరి సీతారామరాజు జిల్లాను సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టడం గర్హనీయం. అరెస్టయిన వారిలో తల్లిదండ్రులతోపాటు విద్యార్థి నాయకులు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పి.అప్పలనర్స, ధర్మన పడాల్, చిన్నారావు, రాధాకృష్ణ, గంపరాయ భానుప్రకాష్ తదితరులున్నారు. అక్కడే ఉన్న తల్లులు, నాయకుల అరెస్టును ప్రతిఘటిస్తున్నా పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తక్షణం అక్రమ అరెస్టులను ఆపి మారికవలస గురుకుల పాఠశాలను పునరుద్దరించి ఆదివాసీ బాలబాలికలకు న్యాయం చేయాలని, విద్యాసంవత్సరం మధ్యలో వారి చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి