గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్ధరణ పట్ల సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హర్షం

విద్యార్థుల, తల్లిదండ్రుల పోరాట ఫలితంగా విశాఖ మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్ధరణ పట్ల సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. 

విద్యార్థుల, తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు మారికవలస స్కూలును అభివృద్ధి చేయాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. 

అలాగే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను కూడా విశాఖలో రుషికొండ గెస్ట్ హౌస్ సహా ఏదో ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ భవనంలోనైనా వెంటనే ప్రారంభించాలని శ్రీనివాసరావు కోరారు.
-జె.జయరాం
ఆఫీస్ కార్యదర్శి