
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 అక్టోబర్, 2026.
నానా పటేకర్ మృతికి సంతాపం
బాలివుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఏ పాత్రలోనైనా తనదైన శైలిలో ఇమిడిపోగలిగిన గొప్ప కళాకారుడు. అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించిన మేటి. పద్మశ్రీ వంటి అవార్డులు పొందారు. విలక్షణ నటుడిగా పేరు పొందారు. కార్గిల్ యుద్దంలో సైనికులతో పాటు 60 రోజులపాటు పాల్గొనడం ద్వారా ఆయన తన దేశభక్తిని చాటుకున్నారు, ఆయన మృతి కళా రంగానికి తీరని లోటని వి.శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
