
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 09 అక్టోబర్, 2026.
టిడిపి కూటమి కపటత్వం రుజువైంది
-సిపిఐ(యం)
రిజర్వేషన్లు 50 శాతాన్ని మించడానికి వీలు లేదన్న ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిసిలకు 34% రిజర్వేషన్ ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో టిడిపి కూటమి కపటత్వం బట్టబయలైంది. రిజర్వేషన్లకు ఉన్న గరిష్ట పరిమితిని 50 శాతం కంటే పెంచాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ జరగాలన్న విషయం ముఖ్యమంత్రికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియనిది కాదు. కానీ రాష్ట్ర ప్రజలను ప్రత్యేకించి వెనకబడిన తరగతుల వారిని మభ్యపుచ్చడానికే ప్రభుత్వం ఈ తతంగమంతా నడిపింది. రాష్ట్ర ప్రభుత్వ మోసకారితనాన్ని గురించి ఆ బిల్లు తెచ్చినప్పటినుండి సిపిఎం రాష్ట్ర కమిటీ చెబుతూనే ఉంది.
ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడిని వినియోగించి రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అయితే ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా రాజ్యాంగబద్ధమైన రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
