
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 అక్టోబర్, 2026.
సిపిఐ(యం) సీనియర్ నాయకులు యం.ఏ.గఫూర్, నిర్మల గార్ల పెద్ద కుమారుడు కిరణ్ మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్ర దిగ్బ్రాంతి
అమెరికా కాలిఫోర్నియాలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ అకస్మాత్తుగా మరణించిన కిరణ్ మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ వార్త తెలియడంతోనే గఫూర్, నిర్మల గార్లను ఫోన్ ద్వారా పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా వుండాలని విజ్ఞప్తి చేశారు. కిరణ్ మరణంపై సానుభూతిని తెలియచేశారు. మంచి భవిష్యత్తు కలిగిన కిరణ్ అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు. ఈ దు:ఖ సమయంలో ఆ కుటుంబానికి పార్టీ వెన్నంటి ఉంటుందని తెలియజేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
