ఫర్ స్క్రోలింగ్ :
గిరిబాబు మృతికి సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపం.
ప్రముఖ తెలుగు సినీ నటుడు బహుముఖ నటనా చాతుర్యం కలిగిన గిరిబాబు మరణం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అనేకమైన విభిన్న పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఘనత గిరిబాబుదన్నారు. ఎంతో సౌమ్యుడు, అందరితో స్నేహశీలంగా ఉండే వ్యక్తి ఆయన గిరిబాబు తన స్వగ్రాములో సైతం అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఆ గ్రామ ప్రజలలో ఒకడిగా కలిసిపోయిన విలక్షన వ్యక్తి అని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు వి.శ్రీనివాసరావు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి
