భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 25 మార్చి, 2024.
కడప జిల్లా కొత్త మాధవరం చేనేత కుటుంబం ‘ఆత్మహత్య’పై సమగ్ర విచారణ జరిపి, ఆత్మహత్యకు కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. తనది సంక్షేమ రాజ్యమని ప్రకటించుకుంటూ నవరత్నాల పేరుతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పాలనకు చేనేత కుటుంబ ఆత్మహత్య, అనంతపురం కలక్టరేట్ వద్ద జరిగిన దళిత గర్భిణి మహిళ ఆకలి చావు సాక్షి భూతాలుగా ఉన్నాయి.