2015

బిజెపిని ఎందుకు నిలదీయరు..?

  ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని, కలిసి వస్తామంటున్న ప్రతిపక్షాలనొదిలి కేంద్రంతో ఎందుకు లాలూచీ పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఓ ఛానల్లో జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే మౌనం పాటిస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా చంద్రబాబు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని తెలిపారు.

ప్రత్యేక వంచన పర్యవసానం..

ప్రత్యేక హోదాకు ఏవో రాజ్యాంగ అవరోధాలు ఉన్నాయనేది అర్థ రహితమైన వాదన. పార్లమెంటు ఆమోదిస్తే తప్పక మంజూరు చేయొచ్చు. ప్యాకేజీల వంటివి ప్రభుత్వమే ఇవ్చొచ్చు. ఇటీవలే ఎన్నికలు జరిగే బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు భారీ నిధుల కేటాయింపు ప్రకటించారు. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌కూ ఇవ్వొచ్చు. కాకపోతే బిజెపి రాజకీయ లెక్కలే ఆటంకమవుతున్నాయి. గతంలో తెలంగాణ ఇచ్చి ఓట్లు పొందాలని భంగపడిన కాంగ్రెస్‌లాగే ఇప్పుడు బిజెపి కూడా ఎన్నికల ముందు ప్రకటిస్తే తమకు లాభం అనుకుంటున్నదనేది ఒక వాదన. 

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడడమే కామ్రేడ్ సూర్యం కు ఘనమైన నివాళి .. సిహెచ్. నరసింగరావు, లోకనాధం

గిరిజన హక్కుల రక్షణకు , బాక్సైటు తవ్వకాలను జరపనివ్వ బోమని .. అటవీ హక్కుల రక్షణకు .. ఆదివాసిలకు మెరుగైన సదుపాయాల కల్పనే .. కా. యెమ్. సూర్యనారాయణకు ఇచ్చే నిజ నివాళి.. సూర్య ప్రధమ వర్దంతి సభలో సి. ఐ. టి. యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కా. . సి హెచ్. నరసింగ రావు అన్నారు. సూర్య కార్మిక , కర్షక ఉద్యమ స్పూర్తి అని కా. లోకనాధం నివాళి అర్పించారు.  లోకనాధం గారు మాటలాడుతూ  కామ్రేడ్ సూర్యం ప్రజలను ఇష్టపడ్డాడు .. ఈ సమాజం ఇంతకన్నా బాగుపడాలనుకున్నాడు, సమతా సిద్దాంతాన్ని ఇష్టంగా నమ్మాడు. ఉద్యమాన్ని తన చిరునామా చేసుకున్నాడు.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉద్యమ పిడుగై గర్జించాడు. మైదాన మండలంలో పుట్టిన సూర్యం..

సంఘానికి కట్టడి?

విద్యాలయాల్లో ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌, వ్యవస్థాగత లోపాలను నిరోధించలేని ప్రభుత్వం, ఆ దారుణాలపై నిలదీసే విద్యార్థి సంఘాలపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గం. నిన్న రిషితేశ్వరి, నేడు మధువర్ధనరెడ్డి ర్యాగింగ్‌ భూతానికి బలయ్యారు. సునీత మరణం వివాదాస్పదంగా మారింది. ఆ మరణాలపై నిరసనలు మిన్నంటాయి. నాగార్జున వర్శిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంపై పెద్ద ఉద్యమమే లేచింది. కళాశాలల్లో ర్యాగింగ్‌ మహమ్మారి స్వైర విహారం చేస్తున్నా నిద్ర వీడని సర్కారు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థి సంఘాలను కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వం.

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లకై కృషి..

సిపిఎం ఆధ్వర్యాన రాజమండ్రిలో "ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు" అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధ్యసాధ్యాల పై పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కై సిపిఎం కృషి చేస్తోందన్నారు. 

బాబు ఇంటికి T ఎసిబి..

ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంటికి, ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు.ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అధికారిక డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ముఖ్యమైన నింధితులు ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడంతో ఇలా క్రింది స్థాయి వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎపికి ప్రత్యేకహోదా:సిపిఎం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి డి.గౌస్‌ దేశారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గౌస్‌దేశారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు బిజెపి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాని కోరారు. బిజెపి, టిడిపి కుమ్మ క్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నిక లకు ముందు ప్రత్యేకహోదాపై గగ్గోలు పెట్టి ఇప్పుడు పలకడం లేదని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేసి పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Pages

Subscribe to RSS - 2015