విశాఖనగరంలో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును తరలింపును, దాన్ని ప్రభుత్వ`ప్రైవేట్`భాగస్వామ్యం (పిపిపి) పేరుతో ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పడాన్ని సిపిఐ(యం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 1971లో 625 ఎకరాల విస్తీర్ణంలో జూ పార్కు ఏర్పడిరది. ఇది రెండు కొండల మధ్య, ఒకవైపు నేషనల్‌హైవే మరోవైపు సముద్రతీరం మధ్య ఉంది. ఇది వన్యప్రాణులకు సంరక్షణార్ధం ఎంతో ఉపయోగకరంగా ఉంది. పిల్లలకు, పెద్దలకు విజ్ఞానం, వినోదాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది అతిపెద్ద జంతుప్రదర్శనశాల.