April

దిశా నిర్దేశం చేయనున్న సిపిఎం 23వ మహాసభ

నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా...అదే సమయంలో...హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సాగే రాజకీయ సైద్ధాతిక పోరాటాల సమ్మేళనంగానే బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ పాలనపై సాగే పోరాటం వుండాలని సిపిఎం ఎప్పుడూ చెబుతూ వస్తుంది. హిందూత్వ ముద్రతో కూడిన జాతీయవాదం, అందులో అంతర్లీనంగా ముస్లిం వ్యతిరేకత అనేది ప్రజల్లో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ప్రజల్లో గణనీయ వర్గాలను ప్రభావితం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తించాల్సి వుంది. హిందూత్వకు రాజకీయ-సైద్ధాంతిక ప్రతివాదాన్ని నిర్మించి, ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళని పక్షంలో హిందూత్వ-కార్పొరేట్‌ వర్గాల పాలనను దీటుగా, సమర్ధవంతంగా సవాలు చేయలేం.

మతోన్మాద శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత

చరిత్రలో సిపిఎం - 5 దేశంలోని భిన్నత్వాన్ని, సామరస్యాన్ని దెబ్బ తీసే మతోన్మాద శక్తుల ఎదుగుదలపై సిపిఎం మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉంది. జనసంఫ్‌ు కాలం నుంచీ ఆ పార్టీ దూరంగా ఉంటూ, దానిని ఒంటరిపాటు చేయటానికీ అన్ని సందర్భాల్లోనూ ప్రయత్నించింది. అవకాశవాదంతో కొన్ని ప్రాంతీయ పార్టీలు దాని పంచన చేరుతున్నప్పుడు, కాంగ్రెస్‌ పలు కీలక సందర్భాల్లో దాని పట్ల ఉదారంగా వ్యవహరించినప్పుడు తీవ్రంగా హెచ్చరించింది. బిజెపి ఎదుగుదల దేశానికి ప్రమాదమని 11వ మహాసభ నుంచి చేస్తున్న తీర్మానాలు ఇప్పుడు అది ఎంత నిజమో స్పష్టమవుతోంది.

అమరావతి అఫిడవిట్‌

రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌ రాజధాని వివాదాన్ని ఇంకా కొనసాగించే ఉద్దేశాన్ని సూచిస్తోంది. రాజధానిలో, రాజధాని ప్రాంతంలో ప్రధాన మౌలిక పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు మూడు మాసాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను స్వాధీనం చేయాలని, ఆర్నెల్లలో రాజధానిని నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అమరావతిపై వ్యాజ్యాలలో మార్చి 3న హైకోర్టు తీర్పు వెలువరించింది. దానిపై నెల రోజులకు సర్కారు స్పందించి పనులన్నీ పూర్తి చేయడానికి ఐదేళ్లు కావాలని గడువు కోరింది.

గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై అనంతపురం లో నేడు వాడవాడలా నిరసనలు.

జాతుల సమస్యపై సూత్రబద్ధ వైఖరి

చరిత్రలో సిపిఎం - 3  న సొంత విధానాన్ని రూపొందించుకున్న సిపిఎం సిద్ధాంతం విషయంలో ఎటువంటి రాజీ పడకుండా సాగుతోంది. ఎత్తుగడల విషయంలో మాత్రం పట్టువిడుపులు ప్రదర్శిస్తూ కార్మిక, కర్షక, కష్టజీవుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళుతూ వస్తున్నది. అందువల్లనే బెంగాల్‌లో రెండవ యునైటెడ్‌ఫ్రంట్‌లో ఇతరులకన్నా అసెంబ్లీ స్థానాలు తనకే ఎక్కువ వచ్చినప్పటికీ ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని బంగ్లా కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది.

ప్రజా ఉద్యమాల్లో నిగ్గుతేలిన స్వతంత్ర పంథా

చరిత్రలో సిపిఎం 2 రివిజనిజంతో తెగతెంపులు చేసుకున్న సిపిఎం- బర్ద్వాన్‌ ప్లీనంలో అతివాద పెడ ధోరణి నుంచి కూడా స్పష్టంగా వేరుపడింది. అటు రష్యా మార్గం, ఇటు చైనా మార్గం అని కాక భారతదేశ నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకున్న స్వతంత్ర పంథాలో ముందుకు సాగింది. దేశవ్యాపితంగా ప్రజా ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించింది. సిపిఎం పంథా సరైందని ప్రజలు నిరూపించారు. కేరళ, బెంగాల్‌, త్రిపురలో కూడా అధిక సంఖ్యలో ఆ పార్టీ అభ్యర్థులను ఎన్నుకొన్నారు. 

Pages

Subscribe to RSS - April