August

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లకై కృషి..

సిపిఎం ఆధ్వర్యాన రాజమండ్రిలో "ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు" అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధ్యసాధ్యాల పై పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కై సిపిఎం కృషి చేస్తోందన్నారు. 

బాబు ఇంటికి T ఎసిబి..

ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంటికి, ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు.ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అధికారిక డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ముఖ్యమైన నింధితులు ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడంతో ఇలా క్రింది స్థాయి వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎపికి ప్రత్యేకహోదా:సిపిఎం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి డి.గౌస్‌ దేశారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గౌస్‌దేశారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు బిజెపి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాని కోరారు. బిజెపి, టిడిపి కుమ్మ క్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నిక లకు ముందు ప్రత్యేకహోదాపై గగ్గోలు పెట్టి ఇప్పుడు పలకడం లేదని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేసి పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కేరళ తరహా వెల్ఫేర్‌ బోర్డు అవసరం..

రాష్ట్రంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. దీన్ని రక్షించాలంటే కేరళలో గతంలో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ఫేర్‌ బోర్డు తరహాలో ఇక్కడా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో మూడు లక్షల మగ్గాలపైనా, వీటి ఉప వృత్తులపైనా ఆధారపడి సుమారు నాలుగు లక్షల మంది జీవిస్తున్నారు. చేనేత సహకార రంగంలో కార్మికులకు 5 శాతానికి మించి పని దొరకడం లేదు. మిగతా వారంతా ప్రైవేటు రంగంలోని మాస్టరు వీవర్ల వద్ద చేనేత పని చేస్తున్నారు. వీరికి కనీస వేతనం (మజూరీ) లభించడం లేదు. వస్తున్న ఆదాయంతో భుక్తి గడవక అప్పులు చేస్తూ ఆకలి చావులకు, ఆత్మహత్యలకు బలవుతున్నారు.

రవాణా కార్మికుల బీమా..ప్రభుత్వ డ్రామా

ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు మేడే రోజున రవాణా కార్మికుల ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించి, కార్మికుల పక్షాన ఉన్నట్లు పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం ప్రకటన వెనుక కూడా కారణముంది. కార్మికవర్గం తరతరాలుగా పోరాడి, సాధించుకున్న కార్మిక చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేసి కార్పొరేట్‌ సంస్థలు కార్మికులను మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేశాయి. కార్మికులు, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్మికుల బీమాను ప్రభుత్వం ప్రకటించింది తప్ప, కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కాదు. ఇది కార్మికులకు శాశ్వత పథకం కాదు.

ఆహ్వానించదగ్గ పరిణామం..

  ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో శాంతిస్థాపన దిశగా తీవ్రవాదులతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ఒప్పందంతోనైనా దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ అంతమవుతుందని ఆశించవచ్చు. అయితే, ఆశలు, ఆకాంక్షలు వేరు. క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవ పరిస్థితులు వేరు. ఇది సూత్రప్రాయ అంగీకారం మాత్రమేనని ఒప్పందం కుదుర్చుకున్న నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఇసాక్‌-ముయివా) -ఎన్‌ఎస్‌సిఎన్‌(ఐఎం) వర్గాలు చెబుతుండగా ప్రభుత్వం మాత్రం ఘన విజయంగా ప్రకటించుకుంటోంది. ఒప్పందంలోని అంశాలను బహిర్గతం చేయకపోవడం కూడా సందేహాలకు కారణమౌతోంది.

విద్యా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకే బంద్‌..

ప్రైవేట్‌ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ, డిగ్రీలో సెమిస్టర్‌ విధానాన్నీ రద్దు చేయాలని, సంక్షేమ హాస్టళ్ళను మూసివేసే జీవో నెంబర్‌ 45ను రద్దు చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని పటి ష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు సంఘా ల ఆధర్యంలో ఏర్పడిన విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నాం. విలీనం పేరుతో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు మూసివేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా ఐదు వేలకు పైగా పాఠశాలలు మూత పడుతున్నాయి.

ఇది కార్మిక ఆస్తి:ఎం.ఎ.గఫూర్‌

భజరంగ్‌ జూట్‌మిల్లు అక్రమ లాకౌట్‌ వ్యవహారాన్ని తేలుస్తారో.. లేక తేల్చుకోమంటారో తేల్చి చెప్పాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. గఫూర్‌ ప్రభుత్వానికి సవాలు విసిరారు. అక్రమ లాకౌట్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం దీక్షలను ఆయన ప్రారంభించారు. గఫూర్‌ మాట్లాడుతూ భజరంగ్‌ జూట్‌మిల్లు ఆస్తులు ప్రస్తుత యజమానివి కావన్నారు. ఆ వాస్తవాన్ని గమనించి మిల్లు నడపడం చేతకాకపోతే ప్రభుత్వానికి అప్పగించిపోవాలే తప్ప అమ్ముకునేందుకు వారికి హక్కు లేదన్నారు. వారు ఈ విషయాన్ని గుర్తెరగని పక్షంలో 'ఇది కార్మిక ఆస్తి' అని ఇక్కడ బోర్డు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రైతు సమస్యలపై కుప్పంలో పర్యటన..

కుప్పంలో ఏకపక్షంగా జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగిస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. విమానాశ్రయం కోసం భూములు కోల్పోతున్న కుప్పం నియోజక వర్గంలోని కడపల్లి, పాడుచేన్లు, తిమ్మరాజుపల్లి, కనుమలదొడ్డి, బీర్నకుప్పం గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములను ఆయన సందర్శించారు.

Pages

Subscribe to RSS - August