August

పోలీస్ కేసులకు భయపడొద్దు:మధు

'పోలీసు కేసులకు భయపడితే ఎయిర్‌పోర్టుకు భూములు పోవడం ఖాయం. కేసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది.' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గురువారం ఆయన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఒకటైన కౌలువాడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడారు. ప్రజాప్రతిఘటన ముందు అన్నీ బలాదూరేనని అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు కావాలని ప్రభుత్వం తొలుత చెప్పిందని, ప్రజల తిరుగుబాటుతో వెనక్కి తగ్గి 5,551 ఎకరాలకు దిగివచ్చిందని తెలిపారు.

వైద్యం ప్రభుత్వ బాధ్యతే:సిపిఎం

ప్రజలకు వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి 47వ వార్డు పరిధి గుల్లలపాలెం జివిఎంసి ఆసుపత్రి వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్ని నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారని, మల్కాపురం, శ్రీహరిపురం ప్రాంతాల్లో రెండు డిస్పెన్షరీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పేరుకే 30 పడకల ఆసుపత్రులైనప్పటికీ, కొన్ని వ్యాధులకే మందులుంటున్నాయని పేర్కొన్నారు.

బాబు జపాన్ కు దాసోహం:BVR

శ్రీకాకుళం పోలాకీ లో  విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా 1,890 ఎకరాల భూమి సేకరిస్తోందని,టెండర్లు కూడా పిలవకుండా జపాన్ కు చెందిన సుమోటోమీ కంపెనీకి భూములను రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తోందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. 

నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు!

ఆ గ్రామాలు కాలుష్యానికి చిరునామాలు....! రోగాలకు నిలయాలు.....!! నీటి యుద్ధాలకు నిలువుటద్దాలు....!!! అవి ఎక్కడా అనుకుంటున్నారా! అత్యంత కాలుష్య నగరంగా రికార్డుల కెక్కిన విశాఖ సమీపంలోని సింహాద్రి ఎన్‌టిపిసి విద్యుత్‌ కర్మాగార చుట్టుప్రక్కల గ్రామాలు. వివిధ పరిశ్రమల విషవాయువుల వల్ల కాలుష్య కోరల్లో కూరుకుపోతున్న గ్రామాలు, వాటి వల్ల బలౌతున్న ప్రాణుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తీర ప్రాంతంలో సెజ్‌లు, పిసిపిఐఆర్‌లు, విద్యుత్‌ ప్లాంట్లతో ముంచెత్తనున్నట్లు ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల అక్కడ పరిస్థితులు ఏమిటి?

కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వెన్నులో వ‌ణుకు

కేర‌ళ రాజ‌కీయాల్లో నిర‌స‌న కొత్త పుంత‌లు తొక్కింది. స‌ర్కారు విధానాల‌పై CPM సామాన్యుల‌ను క‌దిలించింది. ఈరోజు కేర‌ళ‌లో సీపీఎం పిలుపుతో 25ల‌క్ష‌ల మంది రోడ్డెక్కారు. 1110 కిలోమీట‌ర్ల పొడ‌వునా మాన‌వ‌హారం సాగించారు. పార్టీ అఖిల భార‌త కార్య‌ద‌ర్శి సీతారం ఏచూరి కూడా పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మం ఓ ప్ర‌పంచ రికార్డుగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌జాకంటక కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది. నిర‌స‌న కార్య‌క్ర‌మానికే ఇంత పెద్ద స్థాయిలో క‌దిలిరావ‌డంతో వారిలో క‌ల‌క‌లం మొద‌ల‌య్యింది. త్వ‌ర‌లో పెనుమార్పుల‌కు సంకేతంగా క‌నిపిస్తోంది.

భారత్‌కు వస్తే ప్రాణ హానే..

భారతదేశానికి తిరిగివస్తే తన ప్రాణాలకే తీవ్ర ముప్పు ఉంటుందని, అందుకే తను వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ స్పష్టం చేశారు. టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి తనకు ఇంతవరకు ఎలాంటి సమన్లు అందలేదని తెలిపారు. లలిత్‌మోదీపై దాఖలైన కేసు విషయంలో రెడ్ నోటీసును జారీచేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంటర్‌పోల్‌ను కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముంబై కోర్టు కూడా ఇప్పటికే లలిత్‌మోదీపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీచేసింది. వీటన్నింటి నేపథ్యంలో మాట్లాడిన లలిత్‌మోదీ ‘నాకింతవరకు ఎలాంటి సమన్లు అందలేదు.

అక్రమంగా మ‌ధు అరెస్ట్..

శ్రీకాకుళం జిల్లాలో పోలాకి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి వెళ్లిన సిపిఎం  నాయకులపై ప్రభుత్వం నిర్బంధం ప్ర‌యోగించింది. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి మ‌ధుని దౌర్జన్యంగా  అరెస్ట్ చేసారు. ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్ప‌టికే స్థానికులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప‌లు ఉద్య‌మాలు సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకుని, బాధితుల గోడు విన‌డానికి వెళ్లాల‌నుకున్ననాయకుల సమాచారం ముందుగానే  తెలుసుకుని రైల్వే స్టేష‌న్ లో దిగ‌గానే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

Pages

Subscribe to RSS - August