December

ప్రైవేటుకు అనుకూలంగా 633జిఓ

ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ సేవలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. అందుకు అనుకూలంగానే అక్టోబర్‌ 14న జిఓ నెంబర్‌ 633ను విడుదల చేసిందని ప్రజా ఆరోగ్య వేదిక ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. 

దళితులంతాపోరాటాల్లోపాల్గొనాలి:KVPS

నవసమాజ నిర్మాణం కోసం జరిగే సామాజిక ఉద్యమాలే అంబేద్కర్‌కు నిజమై న నివాళి అని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు అన్నారు. రాజమం డ్రిలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్‌ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ సామాజిక న్యాయం కోసం పోరాడారని, కానీ నేటి పాలకులు సమాజం లో అంతరాలను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా దళి తులంతా సామాజిక పోరాటాల్లో పాల్గొనాలని కోరారు. మాజీ ఎంపీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబూరావు మాట్లాడుతూ దళితులు చదువుకోవ డం ద్వారా కొంత ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతున్నారని తెలిపారు.

మతోన్మాదంపై లౌకకవాద పార్టీలతో కలిసి పోరాటం

 బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని జమ్మూ కాశ్మీర్‌ సిపిఎం ఎమ్మెల్యే మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగామి విమర్శించారు.మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలో ఆదివారం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే యూసుఫ్‌ తరిగామి మాట్లాడుతూ, ఎన్నో కలలు కన్న స్వాతంత్ర భారతదేశం నేడు లేదని ,మత ఛాందసవాదం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించేందుకే ప్రభుత్వం అసహనం పెరిగిందనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పారు. వాస్తవానికి ప్రజలు ఎంతో సహనంగా ఉన్నారని తెలిపారు.

వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ..

చెన్నై వరద బాధితుల సహాయార్థం విజయవాడలో సీపీఎం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య, సిహెచ్ .బాబురావు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్ పలువురు సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.. తాగేందుకు మంచినీళ్లు కూడా లేని చెన్నై వాసులకు ప్రతీ ఒక్కరు మానవతా హృదయంతో సహాయం చేయాలని కోరారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వరద బాధితుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.

తమిళనాడుకి ఒడిశా 5 కోట్ల సాయం

భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి ఒడిశా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మంత్రి విక్రం అరుఖ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిన్న తమిళనాడు సీఎం జయలలితతో మాట్లాడినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత ప్రజలను ఆదుకునేందుకు, సహాయ చర్యల నిమిత్తం తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

Pages

Subscribe to RSS - December