చైనాతో సరిహద్దు వివాదం ఒక పరిష్కారానికి వచ్చే సూచనలు ప్రస్తుతానికి కనబడడం లేదు. సరిహద్దుకి ఇరువైపులా సైన్యాల మోహరింపు తగ్గుముఖం పడుతున్న దాఖలాలూ లేవు. ఈ నేపథ్యంలో అమెరికా నుండి సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశాంగ వ్యవహారాల బాధ్యత)గా ఉన్న మైక్ పాంపియో, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ (రక్షణ రంగ బాధ్యత)గా ఉన్న మార్క్ ఎస్పర్ అక్టోబరు చివరి వారంలో మన దేశానికి వచ్చారు. మిలిటరీ రంగంలో అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా 'బెకా' (బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్) కుదుర్చుకున్నారు.