September

గౌరీ లంకేష్‌ హత్యకు వ్యతిరేకంగా నిరసన

పాత్రికేయులు, హేతువాది గౌరీ లంకేష్‌ హత్యను ఖండిస్తూ వామపక్షాలు విశాఖలో నిరసన చేపట్టారు. మతతత్వ పాలకులు తమను వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని భౌతికంగా నిర్మూలించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో మతతత్వ శక్తులు విజృంభించి కల్బుర్గి, ధబోల్కర్‌, పన్సారే వంటి హేతువాద, ప్రజాతంత్ర శక్తులను హత్యగావించిన తీరులోనే గౌరీ లంకేష్‌ను హత్య చేశారన్నారు. 

పెద సుబ్బారావుకు ఘన నివాళులు

అనారోగ్యంతో గురువారం మృతి చెందిన సిపిఎం సీనియర్‌ సభ్యులు పోపూరి సుబ్బారావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం యడ్లపాడులోని సొంత వ్యవసాయ పొలంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. పార్టీలో నాలుగు దశాబ్ధాలపాటు క్రీయాశీలకంగా పనిచేసినా పోపూరి సుబ్బారావు మృతి వార్త తెలిసిన వెంటనే చిలకలూరిపేట డివిజన్‌లోని పలు గ్రామాల నుండి సిపిఎం కార్యకర్తలు ఆయన మృత దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర రైతు నాయకులు పోపూరి రామారావు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామంలో అనేక విషయాల్లో, వివిధ సందర్భాల్లో సేవలు చేసి, పార్టీలో అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త సుబ్బారావు అని నివాళి అర్పించారు.

11న సీతారాం ఏచూరి గుంటూరు రాక

చరిత్ర గతిని మార్చిన సోవియట్‌ అక్టోబర్‌ మహా విప్లవం శత వార్షికోత్సవాలు, పెట్టుబడి గ్రంధం 150 ఏళ్ల ఉత్సవాలు, కారల్‌ మార్క్సు ద్విశత జయంతి సందర్భంగా ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సదస్సులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. శుక్రవారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు మహా విప్లవ ప్రాధాన్యత, సమకాలీనత అనే అంశంపై ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేస్తారని చెప్పారు.

వరద బాధితులకు సహాయం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో  రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు  సిపిఎం  సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో  భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు. 

చిరువ్యాపారులు జీఎస్టీకి వెలుపలే..

దేశవ్యాప్తంగా ఏకరీతి పన్నుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జీఎస్టీ అమలుకు సంబంధించి మరో కీలకమైన ముందడుగు పడింది. వార్షిక టర్నోవర్‌ రూ.20లక్షల లోపు ఉండే చిరు వ్యాపారులను వస్తుసేవల పన్ను (జీఎస్టీ)కి వెలుపలే ఉంచే విషయంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అలాగే వ్యాపార పరిధిని అనుసరించి ఆయా డీలర్లు/వ్యాపారులపై అజమాయిషీ ఎవరిది ఉండాలనే అంశంలోనూ చాలా వరకు స్పష్టత వచ్చింది.

ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని కాపాడుకోవాలి

మన ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని కాపాడుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ రాసిన ‘సిటిజన్‌ అండ్‌ సొసైటీ’ పుస్తకం ఆవిష్కరణ రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జరిగింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. అనేక సమస్యలున్నా సమాజానికి దారి చూపగల శక్తి దేశానికి ఉందని మోదీ అన్నారు. అన్సారీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. 

వెస్టింగ్‌హౌస్‌ రియాక్టర్ల కోసం రుణం..

వెస్టింగ్‌హౌస్‌ అణు రియాక్టర్లు ఆరింటిని కొనుగోలు చేసేందుకు అమెరికా ఎగుమతి-దిగుమతుల బ్యాంక్‌ నుండి 8-9 బిలియన్ల డాలర్ల రుణాన్ని భారత్‌ కోరుతోంది. ఇందుకు సంబంధించి అమెరికాతో అది చర్చలు జరుపుతోంది. ఇటీవలి కాలంలో అమెరికా-భారత్‌ సంబంధాలు బలపడుతున్న ఫలితంగా ఈ మెగా ప్రాజెక్టు వచ్చింది.

రాఫెల్‌పై భారత్ ఫ్రాన్స్ ఒప్పందం..

ఫ్రాన్స్‌ నుంచి 36 రాఫెల్‌ యుద్ధ విమానాలు దాదాపు రూ.58వేల కోట్ల(7.87 బిలియన్‌ యూరోలు)కు కొనుగోలు చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌లు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం మనదేశ అమ్ములపొదిలో లేని ‘మెటియోర్‌’, ‘స్కాల్ప్‌’ వంటి క్షిపణులు రాఫెల్‌ యుద్ధవిమానాలతో కలిసి భారత వైమానిక దళానికి అందనున్నాయి.

Pages

Subscribe to RSS - September