September

ప్యాకేజీ పేరుతో భ్రమలు:ఏచూరి

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదనీ, ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీని ఎందుకు నిలుపుకోవడం లేదో కేంద్రం చెప్పాలన్నారు.

ఆక్వా ఫుడ్ పార్క్ ,దివీస్ కు వ్యతిరేకంగా పోరాడుతాం

 కాకినాడలో దివీస్ పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.దివీస్ కంపెనీకి భూములు ఇవ్వని రైతులపై కిరాతకంగా దాడులు చేయడం దారుణమన్నారు. సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చే భూములకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం సరిపోదని తెలిపారు.రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని ఎద్దేవా చేశారు. తుండూరు ఆక్వాఫుడ్‌ పార్క్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల పేరుతో 37 వేల ఎకరాల భూమిని సేకరించారని.. అందులో 1 శాతం భూమి కూడా వినియోగంలోకి రాలేదన్నారు.

ఏపీ హోదాపై ప్రజా బ్యాలెట్..

ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు మంగళం పాడి.. ఓ బోగస్ ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని బయట పెట్టేందుకు ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించన్నుట్లు చెప్పారు.

ప్ర‌త్యేక హూదాలో అరెస్టుల ప‌ర్వం

చిత్తూరు జిల్లాలో ప్ర‌త్యేక హూదా కోసం జ‌రిగిన బంద్‌లో 144 సెక్ష‌న్  క్రింద సిపియం పార్టీ,  ప్ర‌జాసంఘాల నాయ‌కుల‌ను అరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఢిల్లీలో వెంకయ్య..బెజవాడలో బాబు

ప్రత్యేక హోదాపై తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మూడు నామాలు పెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హోదాపై ఢిల్లీలో వెంకయ్య నాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామా చేశారన్నారు. కేంద్రం నుండి టీడీపీ బయటకు రావాలని నారాయణ డిమాండ్ చేశారు

ఒబామాతో ప్రధాని మోదీ భేటీ

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఇరు దేశాధినేతలు.. లావోస్‌ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భాగస్వామ్యంపై వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

Pages

Subscribe to RSS - September