September

దొంగ చేతికే తాళాలిచ్చిన ఐరాస..

జెనీవాలోని సౌదీ అరేబియా దౌత్యవేత్త ఫైసల్‌-బిన్‌-హస్సాద్‌ ట్రాద్‌ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షునిగా ఎన్నిక వటం ప్రపంచ దేశాలను విస్మయా నికి గురిచేశాయి. ఈ ఎన్నికను అభ్యుదయ ప్రజాస్వామికవాదులంతా నిరసన తెలియజేస్తు న్నారు. కానీ సౌదీ మిత్ర దేశమైన అమెరికా మాత్రం అభినందనలు తెలుపుతూ సంబరాలు తెలియజేసుకుంటు న్నది. సౌదీ అరేబియాకు మానవహక్కుల కమిషన్‌ అధ్యక్ష పదవి దక్కటమంటే దొంగచే తికి ఇంటి తాళాలిచ్చి కాపలాకాయమనడం తప్ప మరొకటి కాదు. జులైలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ గోప్యంగా ఉంచారు. ఈ విషయం సెప్టెంబరు 17 వరకు బయటి ప్రపంచా నికి తెలియదు.

మద్యపానం నిషేధించాలి:ఐద్వా

మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియారస్తంభం సెంటర్లో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రమణి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యానికి పోరాడాలన్నారు. మద్యం వల్ల హింస పెరిగిపోతోందని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని అన్నారు. మద్యపానం నిషేధించే వరకూ వివిధ రూపాల్లో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తామన్నారు

హామీలన్నీ నీటిమూటలే:దడాల

 ప్రయివేటు రంగంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక యుటిఎఫ్‌ భవనంలో జిల్లా అధ్యక్షులు దిగుపాటి రాజగోపాల్‌ అధ్యక్షతన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) జిల్లా వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సమస్యలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో దళితులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపట్టడం లేదన్నారు. గత 30 సంవత్సరాలుగా రిజర్వేషన్లు దళితులకు అందని ద్రాక్షగా ఉన్నాయన్నారు.

APప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..

దేశానికి అన్నంపెట్టే అన్నదాతల ఆత్మహత్యలను ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు ? రైలు, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అధ్యయనం చేస్తారు ? రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ? ఈ విషయాలపై తమకు పూర్తి సమాచారం కౌంటర్‌ రూపంలో దాఖలు చేయాలని ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశిం చింది.

మంత్రి తీరుపై సీపీఎం ఫైర్

పేదలకు ఉచితంగా సేవ చేయాలని వైద్యులకు సలహా ఇచ్చిన కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు వైద్యరంగం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పేదలకు సేవచేయాలని సలహా ఇచ్చిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రభుత్వం అందుకు విరుద్ధ్దంగా ఎందుకు పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పేదలకు వైద్యం అందించడం ప్రభుత్వం బాధ్యతని అన్నారు.

అర్థరాత్రి CITUనాయకుల అరెస్ట్

విశాఖలోని గంగవరం పోర్టులో మృతి చెందిన కార్మికుడు రాజారావు కుటుంబానికి న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు సోమవారం ఆర్ధరాత్రి దాటాక పోర్టు గేటు వద్ద ఉన్న 130 మంది కార్మికులు, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. రాజారావు విధి నిర్వహణలో ఉండగా సోమవారం మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు నష్ట పరిహారం చెల్లింపుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కార్మికులు మృతదేహంతో పోర్టు గేటు వద్ద బైఠాయించారు.

సీపీఎం నేతలపై పోలీసుల నిఘా..

తెలంగాణలో చలో అసెంబ్లీ సందర్భంగా ఏపీ సరిహదుల్లో ఉన్న సీపీఎం నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. పీఎస్ కు హాజరు కావాలని జగ్గయ్య పేట ఎస్ఐ సీపీఎం నేతలను ఆదేశించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల తరపున పోరాడే సీపీఎం నేతలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు పేర్కొన్నారు.

అర్భన్‌హెల్త్‌ సెంటర్స్‌ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి

జిల్లాలోని అర్భన్‌ హెల్త్‌ సెంటర్ల ఉద్యోగుల ఆరు నెల్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ కోరారు. సోమవారం ఎపి అర్భన్‌ హెల్త్‌ సెంటర్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.పద్మజారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ జీతాల్లేక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిలల్ల స్కూల్‌ ఫీజులు కట్టలేక, కుటుంబాలు గడవక ఉద్యోగులు అప్పుులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను మలాల పుస్తకావిష్కరణ సభలో ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి

అతిచిన్న వయస్సులోనే తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకోవటమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలు అభివృద్ధివైపు పయనించాలంటే విద్యకు మించిన మార్గం లేదని మలాల ఇచ్చిన పిలుపును మనమంతా అందిపుచ్చుకోవాలని ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. సోమవారం వివిఐటి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రపంచ దేశాలు యుద్దాలకు ఖర్చుపెట్టే సొమ్మును విద్యాభివృద్ధికి మళ్లించాలని చెప్పిన మలాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Pages

Subscribe to RSS - September