
పేదల సాగులో ఉన్న అటవీ భూములను స్వాధీనం చేసుకోవద్దని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మైలవరం జాతీయ రహదారిపై రాస్తారోక జరిగింది. ఈ సందర్భంగా రాష్ర్ట కార్యదర్శి పి.మధు ను పోలీసులు అరెస్టు చేశారు. తదనంతరం పోలీసులు మైలవరం పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసులకు పేదలకు మద్య వాగ్వాదం జరిగింది. పోలీసులు విచక్షణ రహితంగా వారిని ఈడ్చి పారేశారు.