ఆర్టికల్స్

అదానీ చేతిలో డేటా సురక్షితమేనా?

మే 3వ తేదీన విశాఖలో అదానీ పుత్రరత్నాల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రెండు డేటా సెంటర్లకు శంకుస్థాపన చేశారు. వీటి వల్ల 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో లక్ష మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 7 సంవత్సరాల్లో 5 దశలుగా సాగే ఈ డేటా సెంటర్లు ఎప్పటికి వాస్తవ రూపం దాల్చుతాయనేది సందేహాస్పదమే. వాస్తవానికి ఈ డేటా సెంటర్లపై 2019 జనవరి లోనే నాటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అదానీతో ఎంవోయూ (మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌) జరిగింది. ఆ తరువాత ప్రభుత్వం మారిపోవడంతో భూసేకరణ వగైరా ఆలస్యమై ఇప్పటికి వాస్తవ రూపం ధరించిందని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. ఈ డేటా సెంటర్ల కోసం విశాఖ, విజయనగరం, అనకాపల్లి...

ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లు .. సుప్రీం తీర్పు - పర్యవసానాలు

సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణించాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావితం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్‌ యాక్షన్‌ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజమైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలా విస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది.
ర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన 103వ...

రిజర్వేషన్లు.. పాలకుల పన్నాగాలు...

''రాజకీయాలలో మనిషికి ఒక ఓటు, ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాము. కానీ మన సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరిదీ ఒకే విలువ అనే సూత్రాన్ని అంగీకరిస్తున్నామా? ఎంత కాలం ఈ వైరుధ్యాల జీవితం? ఈ అసమానతలను వీలైనంత త్వరగా అంతం చేయాలి.'' - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, 1950 జనవరి 26. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సమంజసమే అని అత్యున్నత న్యాయస్థానం గత సోమవారం తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గరు అనుకూలంగాను, మరో ఇద్దరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కూడా వున్నారు. ఈ రిజర్వేషన్లు పొందడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక ప్రాతిపదిక సమంజసమేనా? ఇది నిజంగా...

కలవర పెడుతున్న ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు ప్రజానీకాన్ని కలవ రపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరింది. జులై నెలతో పోలిస్తే ఇది 0.21 శాతం ఎక్కువ. ఆ నెలలో 6.71 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. దేశ వ్యాప్తంగా తిండిగింజలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆగస్టులో చుక్కలను దాటాయి. ఫలితంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ (కన్స్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ) ప్రకారం ఆగస్టులో నిత్యావసర వస్తువుల ధరలు 7.62 శాతం పెరిగాయి. బియ్యం, గోధుమలు, పప్పులు, నూనెల సంగతి అలా ఉంచితే (ఇవి కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి) ఆగస్టు నెలలో ఆలుగడ్డలు, టమోటా, నిమ్మకాయలు, అరటి, వంకాయల...

రాష్ట్రంలో విషపు కోరలు చాస్తున్న మతోన్మాదం

మనది లౌకిక రాజ్యం. దాన్ని పునాదులతో సహా ధ్వంసం చేసేందుకు బిజెపి బుల్డోజరు రాజకీయాలను నడుపుతున్నది. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌ తరహా ప్రయోగాలను ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి చేస్తున్నది. రాష్ట్ర ప్రజలు దీన్ని తిప్పికొట్టాలి. ఈ మధ్య కాలంలో శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి, శోభాయాత్ర వంటి పేర్లతో భక్తులను సమీకరించి పరమత ద్వేషాన్ని, మైనార్టీ వ్యతిరేకతను నూరిపోసేందుకు ప్రయత్నించారు. రాజకీయ పొత్తు పేరుతో జనసైనికుల్ని పావులుగా మార్చుకుంటున్నది. ఈ యాత్రలలో వైసిపి, టిడిపి నాయకులు కూడా చాలా చోట్ల పాల్గొన్నారు. మతాన్ని రాజకీయాలకు ముడివేసి లబ్ధి పొందాలన్న బిజెపి కుయత్నాలకు వైసిపి, టిడిపిలు కూడా తమ వంతు దోహదపడుతున్నాయి. గత వారం రోజులుగా అమలాపురం ప్రాంతంలో...

సాంఘిక సమానత్వ సాధనలో రిజర్వేషన్ల ఆవశ్యకత, పరిమితులు

ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజనులకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒక తాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ(ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమయంలో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్కరణలను చేపట్టాలని, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది.
      దేశంలో వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పలు గ్రూపులు ఆ యా తరగతుల డిమాండ్లపై ఆందోళనలు చేపడుతున్నాయి. వారి వారి ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం బూర్జువా రాజకీయ పార్టీలు...

బుల్డోజర్‌ సంస్కృతి

భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండే సుసంపన్నమైన మన సంస్కృతిని ధ్వంసం చేసేందుకు అత్యంత దుర్మార్గమైన బుల్డోజర్‌ సంస్కృతిని బిజెపి ముందుకు తేవడం ఆందోళన కలిగిస్తోంది. బిజెపి అనుసరిస్తున్న ఈ ధోరణి చాలా ప్రమాదకరం. రాజ్యం క్రూరత్వానికి, అధికార దుర్వినియోగానికి ఈ బుల్డోజర్‌ సంస్కృతి ప్రతీక. ఏళ్ల తరబడి ఈ నిర్మాణాలున్నా ఏనాడూ లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొచ్చింది? అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా , అవి ఏ వర్గానికి చెందినవైనా చర్య తీసుకోవాల్సిందే. కానీ, రోహింగ్యాలు, బంగ్లాదేశీల పేరుతో అమాయకులైన వలస శ్రామికులను, పేదలను ఉపాధికి దూరం చేసి నిలువ నీడలేకుండా చేయడం అమానుషం. మానవ హక్కులకే విరుద్ధం. అక్రమ కట్టడాలను కూల్చాల్సి వస్తే ఢిల్లీలో నాలుగింట మూడొంతులు ఉండవు....

మేధో సంపత్తి

మనిషి-తన సృజనాత్మకత, తెలివి, విజ్ఞానంతో తన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చుకుంటూ సామాజిక ఉత్పత్తిలో ముందుకొచ్చాడు. ఆ మేధో సంపత్తి ఆధునిక సమాజ అభివృద్ధిలో కీలకమైనది. సాధారణంగా మేధో సంపత్తి అనేది ఇతరులు అనధికారికంగా ఉపయోగించకుండా చట్టం రక్షించే మానవ మేధస్సు నుంచి ఆవిష్కృతమైన ఉత్పత్తి. యాజమాన్యాలు స్వాభావికంగా మేధో సంపత్తిపై గుత్తాధిపత్యాన్ని ఏర్పరచుకుంటాయి. 'మానవ ఉత్పాదనలలో అత్యుత్తమమైనది-జ్ఞానం, ఆలోచన. వాటిని సమాజానికి స్వచ్ఛందంగా అందివ్వాలి. ఇవి గాలి వలె ఉచితం' అంటాడు యుఎస్‌ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ బ్రాండీస్‌. మేధో సంపత్తి ఏ ఒక్కరిదో కాదు...అందరిదీ. విజ్ఞానం మానవాళి ఉమ్మడి సొత్తు. ఇది జాతి సంపద. ఈ సంపత్తిని తమ ఖాతాలో వేసుకుని సమాజం...

మన భాష-మన జాతి-మన ఆత్మగౌరవం

ఒక ప్రాంతంలో జీవించే ప్రజలు తమని తాము ఏవిధంగా పాలించుకోవాలో నిర్ణయించుకోగలరు. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వ చట్టాలు, ఉత్తర్వులు, నిర్ణయాలు ఉండడం ప్రజాస్వామ్యానికి కీలకం. భిన్న భాషలు ఉన్న దేశంలో కేంద్రం చేసే నిర్ణయాలను ఆయా ప్రాంతీయ భాషలన్నింటిలోకీ తర్జుమా చేసి పంపవచ్చు. ఆ పని మానేసి ఒక్క హిందీని మాత్రమే రుద్దడం కుట్ర కాక ఇంకేమిటి? రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మీద దాడి గాక ఇంకేమిటి? మనం ఎంతగానో ప్రేమించే మన మాతృభాష మీద దాడి చేయడమంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించడం కాక మరేమిటి ? భాష అనేది మానవులు సృష్టించుకున్నది. తమ అవసరాలను తీర్చుకోడానికి ప్రకృతితో పోరాడుతూ మానవులు...

ఉపేక్ష ఉత్పాతం

నందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండుగలు ఉద్రిక్తతలతో విషాదాంతం కావడం మిక్కిలి ఆందోళనకరం. కేంద్రంలో బిజెపి వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయి. కర్ణాటక హుబ్బళ్లిలో మైనార్టీలు పవిత్రంగా భావించే ప్రార్ధనాస్థలంపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన మార్ఫింగ్‌ ఫొటో వివాదానికి హేతువైంది. అభ్యంతరం తెలుపుతూ మైనార్టీలు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశాక నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడికి మద్దతుగా మతోన్మాద మూకలు రెచ్చిపోయి అత్యంత పైశాచికంగా దాడులు చేయగా పోలీసులతో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి బొమ్మరు హుబ్బళ్లి ఘటనను వ్యవస్థీకృత దాడిగా పేర్కొనగా, హోం మంత్రి జ్ఞానేంద్ర...

మనువాద విధానం

కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సియుఇటి) ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మొన్న సోమవారం తమిళనాడు శాసనసభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం పెద్ద మేల్కొలుపు. ఉన్నత విద్యనభ్యసించగోరు విద్యార్థులు అవకాశాలు కోల్పోతారన్న భయాందోళనలు ముమ్మాటికీ నిజం. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను 2022-23 విద్యాసంవత్సరం నుండే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు యూనివర్శిటీలలో క్లాస్‌ 12 మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చేవారు. ఇక నుండి కామన్‌ ఎంట్రన్స్‌ మార్కులను బట్టి ప్రవేశాలు ఉంటాయి. సియుఇటి అత్యధిక సంఖ్యాక విద్యార్థులకు నష్టదాయకం. వారి...

హిందీ - హిందూత్వ

 రో మారు దేశ వ్యాప్తంగా హిందీ భాష రగడ రగులుకుంది. కర్త, కర్మ, క్రియ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాయే. మొన్న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పార్లమెంటరీ అధికార భాషా ఛైర్మన్‌ హోదాలో అమిత్‌షా మాట్లాడుతూ హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలు కమ్యూనికేషన్‌ భాషగా ఇంగ్లీషుకు బదులు తప్పనిసరిగా హిందీని వాడాలని హుకుం జారీ చేసినంత పని చేశారు. భావ వ్యక్తీకరణకు ఏ భాష అనువుగా ఉంటే ఆ భాషను వాడతారు. అది ప్రజల ప్రాథమిక హక్కు. ఏ భాషను ఉపయోగించాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ఫలాన భాషే మాట్లాడాలని శాసించే అధికారం కేంద్రానికి ఎంతమాత్రం ఉండదు. ఒక పథకం ప్రకారం హిందీని రుద్దే చర్యలో భాగంగానే అమిత్‌షా ఈ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం....

Pages