అణు ఒప్పందం-ప్రతికూల పర్యవసానాలు

భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ప్రారంభం నుంచీ సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో పెట్టుకోవాలనుకున్న విస్తృత శ్రేణి వ్యూహాత్మక పొత్తులో ఇది కీలక భాగంగా వామపక్షాలు భావించాయి. ఈ ఒప్పందంలోని ప్రతి అంశం పట్ల వామపక్షాలు ప్రదర్శించిన వ్యతిరేకత పదేళ్ళ తర్వాత కూడా వాస్తవమేనని రుజువైంది.
బూటకపు వాదనలు
ఈ అణు ఒప్పందం ఇంధన రంగంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొస్తుందని యుపిఎ ప్రభుత్వం నాడు చెప్పింది. దేశానికి అవసరమైన సాంకేతిక, వ్యూహాత్మక ప్రయోజనాలు దీనివల్ల సమకూరతాయని పేర్కొంది. ఈ ఒప్పందం వల్ల ప్రతి ఇంటికీ చాలా చౌకగా విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది. భారత్‌పై గల అణు వివక్ష, సాంకేతికపరమైన ఆంక్షలను ఈ ఒప్పందం ఎత్తివేస్తుందని కూడా నాటి యుపిఎ ప్రభుత్వం పేర్కొంది. 2020 కల్లా 40 వేల మెగావాట్ల అణు విద్యుత్‌ దిగుమతి చేస్తుందంటూ గొప్పగా చెప్పింది. కానీ ఇవన్నీ కేవలం భ్రమలేనని తేలింది. వాస్తవానికి, అధ్యక్షుడు బుష్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పౌర అణు ఒప్పందానికి చొరవ తీసుకుంది. ఆసియా దేశాల పట్ల అమెరికా అనుసరించే భౌగోళిక, రాజకీయ వ్యూహంలో భారతదేశాన్ని ఇరికించేందుకే అలా చేసింది. అందుకు వ్యూహాత్మక సైనిక పొత్తు కావాలని అమెరికా భావించింది. ఈ ప్రాంతంలో భారత్‌ను తన వ్యూహాత్మక మిత్రదేశంగా చేసుకోవాలనుకుంది. అంతేగాక అమెరికా వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు ఏమిటంటే భారత్‌కు అమెరికా అణు రియాక్టర్లను వాణిజ్యపరంగా అమ్మేందుకు అవకాశాలుంటాయి.
అణు ఒప్పందాన్ని ఖరారు చేసి, అమలు చేసినందున భారత్‌ అణు విద్యుత్‌ సామర్థ్యం ఏమీ పెరగలేదు. 2005లో భారత్‌కు 2,770 మెగావాట్ల అణు విద్యుత్‌ స్థాపక ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఇది మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో 2.2 శాతం. 2015లో, అణు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 5,780 మెగావాట్లకు పెరిగింది. కానీ ఇది కూడా మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో 2.1 శాతంగానే ఉంది. ప్రధానంగా కుదంకుళం మొదటి యూనిట్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభమైనం దున అణు విద్యుత్‌ సామర్థ్యంలో ఈ పెంపుదల నమోదైంది. కుదంకుళం అణు విద్యుత్‌ ప్లాంట్‌ సామర్థ్యం వెయ్యి మెగా వాట్లు. భారత్‌-అమెరికా అణు ఒప్పందం కన్నా చాలా ముందు గానే రష్యాతో కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్లాంట్‌ను నిర్మిం చారు. అందువల్ల ఈ ఒప్పందం ఫలితంగా దీన్ని చూడలేం.
ఖరీదైన వ్యవహారం
భారత్‌-అమెరికా అణు ఒప్పందం తర్వాత విదేశీ అణు విద్యుత్‌ ప్లాంట్లను దిగుమతి చేసుకోవాలన్నది వ్యూహం. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. అణు ఒప్పందంపై చర్చలు జరిగే సమయంలోనే వామపక్షాలు ఈ వాస్తవాన్ని ఎత్తి చూపాయి. జైతాపూర్‌ అణు ప్రాజెక్టు ఫ్రెంచి కంపెనీ అరెవాకు చెందిన కొత్త ఇపిఆర్‌ అణు రియాక్టర్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఈ రియాక్టర్లను దిగుమతి చేసుకునే వ్యయం, వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఒకవేళ టారిఫ్‌ రేట్లపై సబ్సిడీ ఇస్తే ఉపయోగం ఏమైనా ఉంటుంది. ఈ రకం రియాక్టర్లు ఇప్పటి వరకూ ఫ్రాన్స్‌తో సహా ప్రపంచంలో ఎక్కడా ప్రారంభం కాలేదనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ ప్లాంట్ల నిర్వహణ, పనితీరుపై అనేక సందేహాలు తలెత్తుతాయి. ఒప్పందంలో క్విడ్‌ ప్రోకోలో భాగంగా అమెరికా నుంచి 10 వేల మెగావాట్ల అణు రియాక్టర్లు కొనుగోలు చేసేందుకు యుపిఎ ప్రభుత్వం కట్టుబడింది. సరఫరాదారులను కూడా బాధ్యులను చేసే చట్టాన్ని తెస్తామని కూడా హామీ ఇచ్చింది. అయితే, భారత పార్లమెంటు ఆమోదించిన పౌర అణు ఒప్పందం మాత్రం అటు యుపిఎ ప్రభుత్వం లేదా ఇటు అమెరికా ప్రభుత్వం భావనలకు, అభిప్రాయాలకు అనుగుణంగా లేదు. భోపాల్‌ విషవాయు దుర్ఘటన అనుభవం నుంచి పాఠాలు తీసుకుని సరఫరాదారులకు కూడా బాధ్యత ఉండేలా చట్టంలో పొందుపరుస్తామని పార్లమెంటుకు హామీ ఇచ్చింది. కొవ్వాడ (ఆంధ్రప్రదేశ్‌), మిథివిర్ది (గుజరాత్‌)లలో అణు పార్కుల కోసం భారత్‌కు రియాక్టర్లు అమ్మాలనుకుంటున్న అమెరికా కంపెనీలకు ఇది పెద్ద అవరోధంగా మారింది. అమెరికన్‌ కంపెనీలను బుజ్జగించేందుకుగానూ సరఫరాదారుల బాధ్యతా నిబంధనను తప్పించుకునేందుకు అప్పుడు యుపిఎ ప్రభుత్వం, ఇప్పుడు మోడీ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ దిశగా తాజా ప్రయత్నం ఒబామా పర్యటన సమయంలో జరిగింది. రూ.1,500 కోట్లతో ఇన్సూరెన్స్‌ పూల్‌ను భారత బీమా కంపెనీలు నెలకొల్పనున్నాయి. సరఫరాదారు కంపెనీలకు నష్టం కలగకుండా ఉండేందుకు ఈ పూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఒప్పందాన్ని వ్యాపారీకరించడం ఇంకా జరగాల్సి ఉంది. ఈ దిగుమతి చేసుకున్న రియాక్టర్లను ఆరింటినీ ఒకేచోట, అణు పార్కుల్లో నెలకొల్పాలన్న ఆలోచన ఫుకుషిమా అణు రియాక్టర్‌ అనుభవం తర్వాత తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళనలను లేవనెత్తింది. అనుకున్న అన్ని చోట్లా కూడా ఈ దిగుమతి చేసుకున్న అణు విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పడానికి తీవ్రమైన ప్రజా ప్రతిఘటన ఎదురవుతోంది. అయినా, యుపిఎ ప్రభుత్వం చూపించిన మూర్ఖత్వాన్నే ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది.
పూర్తి స్థాయిలో లేని అణు సహకారం
ఒప్పందం వల్ల పౌర అణు సహకారానికి హామీ కల్పించబడుతుందని చెబుతూ వస్తున్నప్పటికీ ఆ భ్రమ కూడా తొలగిపోయింది. 2006 ఆగస్టులో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ''పూర్తి స్థాయి పౌర అణు సహకారానికి'' అంటే అణు ఇంధనం, అణు రియాక్టర్ల నుంచి ఉపయోగించిన ఇంధన రీప్రాసెస్‌ వరకూ అంటే పూర్తి స్థాయి అణు ఇంధన చక్రంలోని అన్ని అంశాలకు సంబంధించి హామీ కల్పిస్తుందని పార్లమెంటుకు హామీ ఇచ్చారు. అయితే వాస్తవానికి, అటువంటి పూర్తి స్థాయి అణు సహకారానికి హామీ ఏమీ ఇవ్వలేదని సంతకాలు జరిగిన 123 ఒప్పందం ద్వారా స్పష్టమైంది. దానికి బదులుగా, పూర్తి స్థాయి అంతర్జాతీయ రక్షణలు వున్నప్పటికీ అణు సరఫరాదారుల గ్రూపుతో కలిసి అమెరికా ''ఎన్‌రిచ్‌మెంట్‌, రీప్రాసెసింగ్‌ పరిజ్ఞానానికి'' సంబంధించిన సాంకేతికతను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. సాంకేతిక పరిజ్ఞానం నిరాకరణ ఇలానే కొనసాగుతోంది. రక్షణ సహకార ఒప్పందం కింద కూడా సున్నితమైన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంపై ఆంక్షలు తొలగింపచేయడంలో భారత్‌ విఫలమైంది.
విదేశాంగ విధానంపై రాజీ
భారత విదేశాంగ విధానంపై, వ్యూహాత్మక ప్రతిపత్తిపై షరతులు విధించడం అణు ఒప్పందంలోని అత్యంత ప్రమాద కరమైన అంశం. అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన హైడ్‌ చట్టం అణు ఒప్పందానికి మార్గం సుగమం చేసింది. భారత్‌ వంటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశంతో ఇటువంటి సహకారం ఎప్పుడు కుదురుతుం దంటే ఎలాంటి అడ్డూ అదుపూలేని రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసే దేశం, అమెరికాకు అనుగుణంగా ఉండే విదేశాంగ విధానం కలిగి ఉండి, అణ్వస్త్రవ్యాప్తికి సంబంధించి కీలకమైన విదేశాంగ విధాన చొరవలకు సంబంధించి అమెరికాతో కలిసి పని చేస్తూ ఉంటేనే సహకారం సాధ్యమవుతుందని పేర్కొంది. ఇరాన్‌ అణు ఒప్పందం విషయంపై భారత్‌ వైఖరి మారిన వెంటనే విదేశాంగ విధానంలోని ఈ మార్పు స్పష్టంగా వెల్లడైంది. అణు అంశంలో ఇరాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్‌ తనతో చేతులు కలపాలని అమెరికా డిమాండ్‌ చేసింది. దీనికి కట్టుబడిన ఐఎఇఎలో ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ రెండుసార్లు ఓటు వేసింది. ఇరాన్‌పై ఆంక్షలు విధించడంలో ఐక్యరాజ్య సమితికి మార్గం సుగమం చేసిన రెండవ ఓటు ఇదే.
ఇరాన్‌పై వెనకడుగు
అణు ఒప్పందం విషయంలో ముందుకు సాగాలంటే ఇరాన్‌ అంశంపై సిగ్గు చేటైన రీతిలో ప్రతికూలంగా వ్యవహరించాలన్నది యుపిఎ ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరమైన షరతని అప్పటి అమెరికా రాయబారి డేవిడ్‌ మల్‌ఫోర్డ్‌ చాలా అహంకారపూరిత ధోరణిలో ప్రకటించారు. అమెరికాకు వ్యూహాత్మక మిత్రపక్షంగా భారత్‌ మారే వేగం ఈ అణు ఒప్పందంతో మరింత శీఘ్రతరమైంది. బుష్‌ ప్రభుత్వ డిమాండ్‌ మేరకు ఇరాన్‌-పాకిస్తాన్‌-భారత్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అడ్డంకి కల్పించింది. ఇరాన్‌ నుంచి చమురు ఎగుమతులపై అమెరికా, ఇయు ఆంక్షలు విధించిన తర్వాత లాభదాయకంగా ఉండే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్ళలో భారత్‌ గణనీయంగా కోత విధించింది. ఇరాన్‌ను ఏకాకిని చేయాలన్న అమెరికా ఆదేశాలను భారత ప్రభుత్వం చాలా విశ్వాసపాత్రంగా ఆచరించింది. అటువంటి భారత ప్రభుత్వం, ఒకానొక దశలో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందానికి ప్రయత్నాలు సాగుతున్న విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. సుదీర్ఘమైన చర్చల అనంతరం ఇరాన్‌ పౌర అణు సాంకేతిక పరిజ్ఞానంపై భద్రతా మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాలు, జర్మనీ, ఇరాన్‌ ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు తొలగిపోయి, ఆ దేశ చమురు ఎగుమతులు సాధారణ స్థితికి పునరుద్ధరించబడితే ఇక ఇరాన్‌ ఒక అగ్ర రాజ్యంగా ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో పెను మార్పులను ఈ ఒప్పందం తీసుకురానుంది. ఈ ఒప్పందానికి మోడీ ప్రభుత్వం స్పందించిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ ఒప్పందాన్ని లాంఛనంగా స్వాగతించారు. అయితే, ఒప్పందా న్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే తుది అభిb ాయం వెల్లడించగలమని చెప్పారు. ఇక్కడ మోడీ ప్రభుత్వం చక్రవర్తి పట్ల మరింత విశ్వాసపాత్రంగా ఉంది. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఇటువంటి ఆచితూచి స్పందించడానికి కారణం. అమెరికాను బుజ్జగించేం దుకు ఇరాన్‌తో సంబంధాలను భారత్‌ బలహీనపరచడానికి ప్రయత్నించడం, ఆ దిశగా చర్యలు తీసుకోవడం కూడా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అణు ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఒక మంచి తార్కాణం.
దృతరాష్ట్ర కౌగిలి
రక్షణ సంబంధాలు కీలకంగా ఉండే విస్తృతమైన కూటమిలోకి భారత్‌ను లాగడానికి ఒక ఎరగా మాత్రమే అమెరికన్లు ఈ అణు ఒప్పందాన్ని చూస్తున్నారు. అణు ఒప్పందం తర్వాత భారత్‌-అమెరికా డిఫెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ అగ్రిమెంట్‌పై 2005 జూన్‌లో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం కింద భారత్‌కు అమెరికా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారింది. ఆ రక్షణ ఒప్పందాన్ని ఇప్పుడు మరో పదేళ్ళకు మోడీ ప్రభుత్వం పొడిగించింది. కాగా ఈ ఒప్పందం సారాంశాన్ని వెల్లడించడానికి మోడీ ప్రభుత్వం ఎంత మాత్రం సుముఖంగా లేదు. భారత్‌ ఇప్పుడు వ్యయభరితమైన లైట్‌ వాటర్‌ రియాక్టర్లను దిగుమతి చేసుకునే అవకాశాలున్నాయి. ఈ రియాక్టర్లు చాలా ఖరీదైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్‌ సాధారణ ప్రజానీకానికి ఏ మాత్రం అందుబాటులో ఉండదు. పైగా ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతిలో పర్యావరణ అపాయాలను, ప్రజల భద్రతకు, వారి సంక్షేమానికి ముప్పును కల్గించే అవకాశాలున్నాయి. దీనికి కొనసాగింపుగా, మోడీ ప్రభుత్వం చాలా శ్రద్ధగా అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని, వ్యూహాత్మక దృక్పథాన్ని అనుసరిస్తోంది. ఇది, భారత్‌ను చివరకు బ్రిక్స్‌ భాగస్వాములతో కూడా ఘర్షణ పడే పరిస్థితిలోకి నెడుతోంది. దుష్ట అణు ఒప్పందం ప్రతికూల పర్యవసానాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
- ప్రకాశ్‌ కరత్‌భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ప్రారంభం నుంచీ సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో పెట్టుకోవాలనుకున్న విస్తృత శ్రేణి వ్యూహాత్మక పొత్తులో ఇది కీలక భాగంగా వామపక్షాలు భావించాయి. ఈ ఒప్పందంలోని ప్రతి అంశం పట్ల వామపక్షాలు ప్రదర్శించిన వ్యతిరేకత పదేళ్ళ తర్వాత కూడా వాస్తవమేనని రుజువైంది.

- ప్రకాశ్‌ కరత్‌