ఏపీలో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ ఎప్పుడో మొదలెట్టారు. కాని ఇప్పుడు స్పీడు పెంచారు. ఎవరు అడ్డం పడినా కుదరదని పార్టీ నేతలకు చెప్పేశారు. పలువురు నేతలు కొంత కాలంగా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నా నెమ్మదిగా ఆచితూచి వ్యవహరించారు బాబు. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నా అన్ని ఆలోచించి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ గండిబాబ్జీలు కూడా సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారు.కాని మంత్రి గంటాను కొంత కాలంగా ఇబ్బందులకు గురి చేసిన కొణతాలను చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని బాబుకు సూచించినట్లు తెలుస్తుంది. అయినా సరే పార్టీ అభివృద్దికి కొత్త నీరు అవసరమని నేతలకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.