
మన్యంలో మలేరియా, ఇతర విషజ్వరాల బారిన పడిన అనేక మందికి ఉచిత వైద్య సేవలందించడానికి చింతూరులో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి నెల రోజుల నుండి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని ప్రజా అవసరాలు తీర్చి, ప్రాణాలు నిలబట్టే వైద్యశాలగా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు సారధ్యంలో జేవీవీ, ఇతర ప్రజా రంగాల వైద్యులు, నెల్లూరు ప్రజావైద్యశాలకు చెందిన వైద్యులు కూడా ఇక్కడకు వచ్చి సేవలు అందించారు. సెరిబ్రల్ మలేరియాతో వణుకుతున్న గిరిజనులను ఆదుకుని వారి ప్రాణాలు నిలబెట్టిన ఈ శిబిరానికి పలువురు సహాయం అందించారు.