
పెండింగ్ వేతనాలు, పారితోషకాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆశావర్కర్లు తూర్పుగోదావరి జిల్లా చింతూరు రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీ చేశారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణమూర్తి మాట్లాడారు. ఎంఎల్‌ఎ, ఎంపీల ఇంటి అద్దె అలవెన్సు పెంచుతున్న ప్రభుత్వం తక్కువ వేతనంతో కాలం వెళ్లదీస్తున్న ఆశాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ముంపు మండలాల కార్మికుల సంక్షేమం పై శద్ధ చూపడంలేదన్నారు. తహశీల్దార్ శివకుమార్ ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. అడిషనల్ డిఎంహెచ్‌ఓతో ఫోన్లో మాట్లాడారు.