ఎన్‌డిఎ ప్రభుత్వం - త్రిముఖ ప్రమాదాలు

భారతదేశ జాతీయవాదానికి మత భిన్నత్వంతో సహా తమ బహుళ విధమైన భిన్నత్వాన్ని గౌరవించే విస్తారమైన ప్రజలను కలుపుకుపోవడం కీలకంగా ఉంటుంది. అలా కలుపుకుపోవడమనేది 'భారతదేశ భావన'కు అంటే లౌకిక ప్రజాస్వామ్యానికి కేంద్రకంగా ఉంటుంది. ఇక్కడ లౌకికవాదం, ప్రజాస్వామ్యాలను రెండు భిన్నమైన భావనలంటూ వేరు చేయజాలం. కానీ నేడు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి ఈ రకంగా విడదీస్తున్నాయి. మన లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని ఏమాత్రం సహనం లేని ఫాసిస్టు 'హిందూ రాజ్యంగా' మార్చాలనే తమ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం ద్వారా అవి విడదీస్తున్నాయి.
               అమానుషమైన అత్యవసర పరిస్థితి 40వ వార్షికోత్సవం చరిత్రను వక్రీకరించాలని, దానికి వ్యతిరేకంగా సాగిన ప్రజల ఉమ్మడి పోరాటాన్ని (దుర్‌)వినియోగం చేయాలనుకు నేవారికి ఒక సదవకాశంగా మారింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జరిగిన ఆ పోరాటం నా తరానికి రాజకీయ పరిపక్వత ఉన్న కాలంగా ఉంది. దాని ఫలితంగా నేటి రాజకీయ చిత్రానికి భిన్నమైన పద్ధతిలో మాలో చాలా మందిమి రాజకీయాలను స్వీకరించాం. మెరుగైన భారతదేశాన్ని నిర్మించాలనే ఆ నిబద్ధత కుటుంబ రాజకీయాలను వారసత్వంగా స్వీకరించేవారికి లేదా నయా ఉదారవాద ఆర్థిక విధానాలు తెచ్చిపెట్టిన అవలక్షణమైన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలోని దోపిడీ ఫలితాలను పంచుకోవాలని రాజకీయాల్లో చేరేవారికి భిన్నమైనది. ఆ విధానాలనే ఈ మోడీ ప్రభుత్వం చాలా దూకుడుగా అమలు చేస్తోంది. యుపిఎ ప్రభుత్వ ప్రధాన కుంభకోణాలు బయటపడటానికి ఏడేళ్ళు పట్టగా మోడీ ప్రభుత్వానికి ఒక్క సంవత్సరమే పట్టింది. ప్రస్తుతం (లలిత్‌) మోడీ గేట్‌ కుంభకోణం బహిర్గతం కావడంతో ప్రభుత్వం చాలా నర్మగర్భంగా వ్యవహరిస్తోంది. నాటి పార్లమెంటులో సిపిఐ(ఎం) నేత ఎకె గోపాలన్‌ లోక్‌సభలో చేసిన ప్రముఖ ప్రసంగం అత్యవసర పరిస్థితి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. అయితే దాన్ని మీడియా సెన్సార్‌ చేసింది. మూడు వేల మందికి పైగా సిపిఐ(ఎం) కార్యకర్తలను భయానకమైన మీసా, డిఐఆర్‌ చట్టాల కింద అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే 1975 జులై 21న (లోక్‌సభ అధికారిక కార్యక్రమాల్లో చర్చలు జరిగిన తేదీలు) ఆయన సిపిఐ(ఎం) వైఖరిని వెల్లడించారు. ''అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ చేసిన నూతన ప్రకటనను, లోక్‌సభలో దాన్ని ఆమోదించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేయజాలం. ప్రజాతంత్ర భారతదేశ చిహ్నాలన్నింటినీ తుడిపేయడానికి మేము అంగీకరించజాలం'' అంటూ సిపిఐ(ఎం) వ్యతిరేకించింది. చివరగా ముగిస్తూ ఆయన ఇలా పేర్కొన్నారు : ''ప్రజలెదుర్కొన్న తీవ్ర దుష్పరిణా మానికి వ్యతిరేకంగా వారిని మేల్కొల్పడం, సంఘటిత పరచడం అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా మా పార్టీ పరిగణిస్తుంది. అత్యవసర పరిస్థితిని ఉపసంహరిం చుకునేలా వారిని పోరాటాల్లోకి దింపుతుంది...''
                 ఈ ప్రజా పోరాటాలను గురించి నేడు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి పూర్తి భిన్నమైన వాదనలను విన్పిస్తున్నాయి. ఈ మేరకు మోడీ తన ట్విట్టర్‌ సందేశాన్ని పెట్టలేదు. ప్రస్తుత రాజకీయ విధివిధానాల కింద నిరంకుశ ప్రమాద పోకడలు పొంచి ఉన్నాయని ఎల్‌కె అద్వానీ హెచ్చరించారు. మళ్ళీ వెంటనే ఆయన (ఒత్తిడి రావడంతో) తాను ఆ వ్యాఖ్యలను కాంగ్రెన్‌ను ఉద్దేశించి చేసినట్లు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడల దృష్ట్యా దానికి బీజాలు పడా ్డయనే అను మానాలు తలెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ లొంగు బాటు అప్పుడు అందరికీ విదితమే. ఎమర్జె న్సీకి భూమి కగా మారిన ఇందిరా గాంధీ అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరే కంగా చేపట్టిన ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌, నాటి దాని రాజకీయ అంగమైన జనసంఫ్‌ు నుంచి మద్దతు తీసుకున్న జయప్రకాశ్‌ నారాయణ్‌ ''ఆర్‌ఎస్‌ఎస్‌ యం త్రాంగంతో తనకు న్న గట్టి బంధాన్ని తెంచుకు నే వరకూ జనసంఫ్‌ు లౌకిక త్వానికి వ్యతిరేకం గా చేసే ప్రకట నలను తీవ్రంగా తీసుకో వాల్సిన అవసరం లేదు. అలాగే ఒక రాజ కీయ పార్టీకి మార ్గదర్శిగా, సమర ్థవంతమె ౖన నిర్దేశకురాలిగా ఉన్నంత కాలం ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక సాంస్కృతిక సంస్థగా పరిగణించజాలం'' అని 1968లో చెప్పారు. జనసంఫ్‌ు జనతాపార్టీలో విలీనమై, ప్రభుత్వంలో చేరినప్పుడు ఆ పార్టీ నేతలను ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న అన్ని సంబంధాలనూ తెంచుకోవలసిందిగా నచ్చజెప్పడంలో విఫలమైనందుకు ఆయన భ్రమల్లో ఉన్న వ్యక్తిగా చనిపోయి ఉండాల్సింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని ఈ 'ద్వంద్వ సభ్యత్వ' సమస్య అంతిమంగా ముక్కలు చేసింది.
                   అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత దేవరస్‌ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి అనేక లేఖలు రాశారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన వినోభాభావేకు కూడా లేఖలు రాశారు. మహాత్మా గాంధీ హత్య నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పై విధించి న నిషేధాన్ని తొలగించా లని కోరుతూ సర్దార్‌ పటేల్‌కు నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత గోల్వాల్కర్‌ మోసపూ రితమైన రాజీకి వచ్చిన నేపథ్యం ఉంది. అదే మూసలో ఎరవాడ సెంట్రల్‌ జైలు నుంచి దేవరస్‌ నక్క వినయాలు వలకబోస్తూ 1975 నవంబర్‌ 10న ప్రధాని ఇందిరా గాంధీకి ఒక లేఖ రాశారు. 'మీ ఎన్నిక చెల్లుబాటవు తుందం టూ ఐదుగురు సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు తీర్పు ఇచ్చినం దుకు' అభినంద నలు అంటూ ఆ లేఖలో రాశారు. నిషేధాన్ని తొలగిం చాలని విజ్ఞప్తి చేస్తూ ''లక్షలాది మంది ఆర్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లను జాతీయ అభ్యున్నతి కోసం (ప్రభుత్వ, ప్రభుత్వేతర) ఉపయోగిం చుకోవచ్చు' అంటూ ఎమర్జెన్సీ కాలంలో ప్రవేశపెట్టిన అపఖ్యాతిపాలైన ఇందిరా గాంధీ 20 సూత్రాల కార్యక్రమానికి స్పష్టం గా మద్దతు తెలుపు తూ మరో లేఖ రాశారు. అయితే ఈ లేఖల్లో వేటిలోనూ అత్యవసర పరిస్థితిని ఎత్తేయాలని గానీ, వేలాది మంది డిటెన్యూ లను విడుదల చేయాలని గానీ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. పైగా ''(ఎమర్జెన్సీని సమర్థిస్తూ) సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ డిటెన్యూలకు ఎరవాడ జైలులో నాలుగైదు సార్లు ఒక పత్రాన్ని పంపిణీ చేశారు. అలా సంతకం చేయడానికి మెజారిటీ ఆర్‌ఎస్‌ఎస్‌ డిటెన్యూలు అంగీకారం తెలపడాన్ని నా కళ్ళతో నేను చూశాను'' అని ప్రముఖ సోషలిస్టు నేత బాబా ఉద్ధవ్‌ వెల్లడించారు. ''ఈ ఉద్యమాలతో (జెపి ఉద్యమం) ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు'' అని ఇందిరాగాంధీకి రాసిన లేఖల్లో దేవరస్‌ పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఎలాంటి 'వీరోచిత పోరాటం'లో పాల్గొనకుండా అలా నీచంగా లొంగిపోయిన చరిత్ర వారిది.
                    లౌకికవాదానికి కట్టుబడి ఉండకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యానికి గట్టిగా కట్టుబడి ఉండటమనేది సాధ్యం కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. భారత రిపబ్లిక్‌ లౌకిక ప్రజాతంత్ర స్వభావంలోనే లౌకికవాద భావన ఇమిడి ఉంది. అది ఐరోపా వెస్ట్‌ఫాలియన్‌ అనంతర లౌకికవాద, జాతీయవాద నిర్వచనాన్ని మించి ముందుంటుంది. భారతదేశ జాతీయవాదానికి మత భిన్నత్వంతో సహా తమ బహుళ విధమైన భిన్నత్వాన్ని గౌరవించే విస్తారమైన ప్రజలను కలుపుకుపోవడం కీలకంగా ఉంటుంది. అలా కలుపుకుపోవడమనేది 'భారతదేశ భావన'కు అంటే లౌకిక ప్రజాస్వామ్యానికి కేంద్రకంగా ఉంటుంది. ఇక్కడ లౌకికవాదం, ప్రజాస్వామ్యాలను రెండు భిన్నమైన భావనలంటూ వేరు చేయజాలం. కానీ నేడు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి ఈ రకంగా విడదీస్తు న్నాయి. మన లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని ఏమాత్రం సహనం లేని ఫాసిస్టు 'హిందూ రాజ్యంగా' మార్చాలనే తమ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం ద్వారా అవి విడదీస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపిల ఈ స్వభావమే ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించడం/నాశనం చేయడం ద్వారా నిరంకుశ త్వాన్ని పటిష్టపరిచే ప్రమాదాలను పుణికిపుచ్చుకుంది. ఆ బీజాలు ఇప్పటికే స్పష్టంగా కన్పిస్తున్నాయి. లోక్‌సభలో తన మందబలంతో ఎలాంటి సక్రమమైన పరిశీలన లేకుండానే చట్టాలను ఆమోదింప జేసుకోవడం, తనకు బలంలేని రాజ్యసభ ను పక్కన పెట్టడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలు, పద్ధతులపై ఎలాంటి జంకు లేకుండా దాడులు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తీవ్రంగా బలహీనపడిపోతున్నాయి. మోడీ ప్రభుత్వ త్రిముఖా లలో ఈ రకమైన నిరంకుశ ధోరణి ఒకటి. ప్రజా వ్యతిరేక ఆర్థిక సంస్కరణలను దూకుడుగా అమలు చేయడం, మతాల ప్రాతిపదికన ప్రజలను చీల్చడాన్ని ముమ్మరం చేయడం మిగతా రెండు ముఖాలు. ఈ అత్యవసర పరిస్థితి 40వ వార్షికం లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, నూతన రూపాల్లో ముందుకొస్తున్న నిరంకుశ పోకడలన్నింటినీ ఓడించేందుకు భారత ప్రజలను ప్రేరేపించాలి.
సీతారాం ఏచూరి