క‌ళంకిత క‌మ‌లం

అ...అమ్మ, ఆ...ఆవు' అని చెప్పుకునే రోజులు పోయాయి. 'అ...అవినీతి, ఆ...ఆశ్రిత పక్షపాతం' అనుకోవాల్సిన కాలం వచ్చేసింది. మాది భిన్నమైన పార్టీ. స్వచ్ఛమైన పార్టీ అంటూ జనాన్ని నమ్మించి మరీ గద్దెనెక్కిన బి.జె.పి వారూ తక్కువ తినలేదని నిరూపితమౌతోంది. మోడీ గేట్‌, వ్యాపమ్‌ స్కామ్‌, చిక్కీ కుంభకోణం, అగ్నిమాపకాల కొనుగోళ్ల స్కామ్‌ ఓ వైపు, నకిలీ సర్టిఫికెట్లు- అక్రమ చదువుల ఆరోపణలు మరోవైపు కమలనాథులకు పట్టపగలే చుక్కలు చూయిస్తున్నాయి. 

ఏడాది కిందట కేంద్రంలో గద్దెనెక్కింది భారతీయ జనతా పార్టీ (బి.జె.పి). గత పార్టీలకు తమకు నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందని ఊదరగొట్టేసింది. అసలు అవినీతికి స్పెల్లింగే తెలీదన్నట్టు అదరగొట్టేసింది. నల్లధనం వెలికితీత, పారదర్శకత, జవాబుదారీ తనం గురించి ఆకాశమే హద్దుగా బడాయి బాకాలు ఊదుతుండగానే... ఏడాది పాలన పూర్తయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా ఉత్సవం జరుపుకున్న పదిరోజులకే ఒకదాని తర్వాత ఒకటిగా స్కాముల పుట్టలు పగిలి అవినీతి పాములు బైటికొచ్చి జనాన్ని విస్మయ పరిచాయి. భయ పెట్టాయి. సుష్మా స్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వంటి కమలం పార్టీ సీనియర్‌ నేతలే కాదు. పంకజా ముండే, వినోద్‌ తావ్దే వంటి యువ లీడర్లూ కవల పిల్లల్లాంటి అవినీతిలో, ఆశ్రిత పక్షపాతంలో బాగా చెయ్యి తిరిగిన వారేనని నిరూపించారు.
మోడీ గేట్‌ 
            ఈ మధ్య కాలంలో పత్రికల్లోనూ, టీవీల్లోనూ లలిత్‌ నామ జపం వినిపించని రోజు లేదు. ఐ.పి.ఎల్‌ బాస్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ నేరగాడు అధికారంలో వున్న పెద్దలందరికీ సన్నిహితుడు. పార్టీలకు అతీతంగా పనులు చేయించుకోగల సమర్ధుడు. విదేశీ మారక చట్టం ఉల్లంఘన, ఐపిఎల్‌ బెట్టింగ్‌, నిధుల దుర్వినియోగం, ప్రత్యక్ష ప్రసారాల హక్కుల్లో అవకతవకలు వంటి అనేకానేక అభియోగాలతో మోస్ట్‌ వాంటెడ్‌ పర్సన్‌గా దేశం దాటిపోయిన కేటుగాడు. దాదాపు 1700 కోట్ల రూపాయల అవకతవకలకు కేంద్రబిందువైన ఆర్థిక నేరస్థుడు. అలాంటి వాడికి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే సాయం చేయడం చిన్న విషయం కాదు. కాకపోతే అందుకు వారు చెప్తున్న కారణాలు, చేసిన సహాయాలే వింతగానూ, విపరీతంగానూ వుంటాయి. 
సుష్మా 'మానవీయ కోణం' సూపర్‌!
               లలిత్‌ మోడీ అనే నేరస్థుడు దర్యాప్తులను తప్పించుకోవడానికి లండన్‌ పారిపోయిన మోస గాడు. పోర్చుగల్‌లో ఆయన భార్యకు క్యాన్సర్‌ చికిత్స చేస్తున్నందున జాలిపడి జస్ట్‌ అతను అక్కడికి వెళ్లేందుకు సాయం చేశారట సుష్మా మేడమ్‌. అంతకు మించి అతనికి తనకు ఎలాంటి లావాదేవీలు లేవట. కేవలం మానవీయ కోణంలోనే దీన్ని చూడాలట. నైతిక విలువల ఉల్లంఘన వంటి పెద్ద పెద్ద విషయాలను పట్టించుకోకూడదట. ఇదంతా చదువుతుంటే మన మనసులూ మెత్తబడే అవకాశం వుంది. అసలు విషయం తెలిస్తే మాత్రం ఆమె మీద పట్టరాని ఆగ్రహం కలిగినా ఆశ్చర్యం లేదు. సుష్మా భర్త స్వరాజ్‌ కౌశల్‌ దాదాపు రెండు దశాబ్దాలుగా లలిత్‌ మోడీ లాయర్‌. ఆయన దగ్గర ఫీజు తీసుకుంటూ వెన్నంటి నడిచిన వాడు. అతని లావాదేవీల కోసం కోర్టుల్లో వాదించినవాడు. ఇహ సుష్మ, స్వరాజ్‌ కుమార్తె బాన్సురి కూడా న్యాయవాదే. లలిత్‌ పాస్‌పోర్టు రద్దయిన దగ్గర నుంచి 2014 ఆగస్టు వరకు ఢిల్లీ హైకోర్టులో పోరాడి మరీ పాస్‌పోర్టును పునరుద్ధరింపచేసిన లాయర్‌. సుష్మాజీ ఇన్ని మతలబులను విడిచిపెట్టి కేవలం మానవీయ కోణంతోనే లలిత్‌కు సాయం చేశాననడం కరెక్టు కాదు కదా.
లమో- రాజే స్నేహ గీతం 
              లలిత్‌ బ్రిటన్‌ పారిపోవడానికి సాయం చేసిన మరొక ప్రముఖురాలు వసుంధర రాజే. ఈమె మొదటిసారి రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లలిత్‌ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగాడు. షాడో సీఎంగా పెత్తనం చెలాయించాడు. అందుకు కారణం లేకపోలేదు. వసుంధర తల్లిదండ్రులకు లలిత్‌ పెద్దలకు గట్టి మైత్రీ బంధం వుంది. అదే వీరి మధ్యా ప్రతిబింబించింది. లలిత్‌ మోడీ వీసా కోసం రాజే బ్రిటన్‌ ప్రభుత్వానికి లేఖ రాయడమే కాదు... అతని భార్యకు అండగా వుండేందుకు పోర్చుగల్‌ సైతం వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక లలిత్‌ భార్యకు వైద్యం చేసిన పోర్చుగల్‌ ఆసుపత్రి వారికి రాజస్థాన్‌లో హాస్పటల్‌ కట్టుకోవడానికి స్థలం కూడా కేటాయించారు. ఇవన్నీ కేవలం స్నేహం కోసమే అంటారామె. కాకపోతే క్విడ్‌ ప్రో కో లేకపోలేదు. రాజె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌కు చెందిన ఓ హోటల్‌ వ్యాపారంలో 11 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాడు లలిత్‌. అదీ కేవలం పది రూపాయల విలువ చేసే ఒక్కో షేరును ఏకంగా 96,200 రూపాయలకు కొనిపారేశారు ఉదారంగా. ఇదిలా వుండగా ప్రభుత్వ అధీనంలో వున్న ధోల్‌పూర్‌ ప్యాలెస్‌ను స్వాహా చేయడంలో, ప్రయివేటు హోటల్‌గా మార్చడంలో, దాని నిర్వహణలో లలిత్‌, దుష్యంత్‌ ఇద్దరికీ భాగస్వామ్యం వుంది. రాజే ఇవన్నీ దాచిపెట్టి నాకేం తెలీదు. నంగనాచినంటే జనం నమ్ముతారా?!
వ్యాపమ్‌'...రియల్‌ హారర్‌ మూవీ!
              భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఏ హాలీవుడ్‌ హారర్‌ మూవీ అయినా సరే! వ్యాపమ్‌ ముందు బలాదూరే! ఒళ్లు గగుర్పొడిచే హత్యలు, అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్యతో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలీనంత ఉత్కంఠభరితంగా, భయానకంగా సా...గుతోందీ బహిరంగ మానవ హననం. ఇప్పటి వరకు మనం చూసిన కుంభకోణాలు వేరు. వ్యాపమ్‌ వేరు. వాటన్నిటికీ లేనిదీ, దీనికి అదనంగా వున్నదీ అమాయకుల రక్త తర్పణం. మధ్య ప్రదేశ్‌లోని మారు మూల పల్లెల్లో సైతం దీని బాధితులున్నారు. 'వ్యాపమ్‌' పూర్తి నామం 'వ్యావసాయక్‌ పరీక్షా మండల్‌'. ఉద్యోగ నియామకాలు, ప్రవేశాల కుంభకోణం. 'ఎలాగైనా సరే' ఒక్కటంటే ఒక్క ప్రభుత్వోద్యోగం సంపాదించి బతుక్కి ఓ భరోసా కల్పించుకోవాలని ఆశపడే సామాన్యులు... వారి ఆశలను ఆసరా చేసుకుని లాభపడాలనుకొనే అధికారులు... వారితో చేతులు కలిపి అడ్డ దారులు తొక్కిన ఏలికలు ... కలిస్తేనే వ్యాపమ్‌. మొత్తం మీద వ్యవస్థీకృతమైన అవినీతికి నిలువెత్తు రూపం ఈ కుంభకోణం. ప్రయివేటు పెట్టుబడులు, పారిశ్రామికీకరణ నామమాత్రంగా వున్న రాష్ట్రంలో సామాన్యులకు ఏ సమస్య వచ్చినా, ఏ సాయం కావాలన్నా ప్రభుత్వం వైపే చూడాలి. అలాంటి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం సహజంగానే యువత ఎదురు చూస్తుంది. వారి ఆరాటాన్ని సొమ్ము చేసుకోడానికి జిల్లా స్థాయి అధికారులు లేశమాత్రం వెనుకాడలేదు. అర్హత లేనివారికి మెడికల్‌ కాలేజీల్లో సీట్లు ఇచ్చేశారు ఉదారంగా. కానిస్టేబుల్‌, టీచర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఆడిటర్‌ తదితర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ నిబంధనలకు నీళ్లొదిలారు. ఒకరి తరపున వేరొకరు పరీక్ష రాసినా అభ్యంతర పెట్టలేదు. అభ్యర్థికి అనుకూలంగా వుండేలా పరీక్షల్లో సీట్లు మార్చడానికీ, ఒఎంఆర్‌ షీట్లు మార్చడానికీ వెనుకాడలేదు. 2008-13 మధ్య కాలంలో వెయ్యి మందికి పైగా అనర్హులు వైద్య కళాశాలల్లో చేరారు. అంటే అంతమంది అర్హులకు అన్యాయం జరిగిందన్నమాట. 
                  ఎప్పటి నుంచో ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరుగుతున్నా 2003లో బి.జె.పి అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ వ్యవహారాలు భారీ ఎత్తున జరిగి దేశం దాటి ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ తర్వాత రెండేళ్లకి గద్దెనెక్కిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అప్పటి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. అక్కడి అక్రమాలకు సంబంధించి వెలువడుతున్న వార్తలు, వాస్తవాలు చూస్తుంటే ఇది ఒక కుంభకోణం కానే కాదు. అనేకానేక స్కాముల పుట్ట. సమస్యల గుట్ట అనిపిస్తోంది. వ్యాపమ్‌ ద్వారా అర్హత లేకుండానే కాలేజీల్లో సీట్లు సంపాదించుకున్నవారు, వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన వారు, ఇచ్చిన వారు, ఈ అవినీతి పుట్టలను తవ్వి వార్తలు రాస్తున్న విలేకరులు .. వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం చూస్తూనే వున్నాం. వీరిలో మద్యం తాగి చనిపోయేవారు, రోడ్డు మీద నడుస్తుండగా భారీ వాహనం గుద్దడంతో ప్రాణాలు విడిచేవారు, లాడ్జీల్లో-హోటళ్లలో విడిది చేసినవారు చేసినట్టే విగతజీవులయ్యేవారు, రైల్వే పట్టాల పక్కన... నీటి గుంతల్లో శవాలై తేలేవారు ... ఎందరో! ఈ మృతుల్లో గవర్నర్‌ కుమారుడు కూడా వుండడం సమస్య తీవ్రతను తెలుపుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఇలా చనిపోయింది పాతికమందే. కానీ ఆత్మహత్య లుగానో, దుర్ఘటనలుగానో చిత్రించ బడుతున్న ఈ మృతులు యాభై వరకు వుండొచ్చని పత్రికల కథనం. 
                  ఈ కుంభకోణంలో ముద్దాయిలుగా వున్న దాదాపు 2500 మందిలో ఏ ఒక్కరూ ఆర్థిక నేరగాళ్లు కారు. ఏదో చిన్నా చితకా ఉద్యోగం సంపాదించుకోవాలని ఆశపడినవారే. వీరిలో 800 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మంత్రులకు సన్నిహితులు, గవర్నర్‌ రామ్‌ నరేశ్‌ యాదవ్‌ కుమారుడు శైలేశ్‌ యాదవ్‌, ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు కూడా వున్నారు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్‌ ఈ కుంభకోణంలో పదవ నిందితుడిగా వుండడాన్ని బట్టి ఈ స్కాము వేళ్లు ఎంత లోతుగా విస్తరించాయో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరుగు తున్నా... స్కామలు, వాటి మూల విరాట్టుల గురించి ముఖ్యమంత్రి చౌహాన్‌ గారికి తెలీదంటే నమ్మలేం. ఆయన బంధువర్గానికి, కుటుంబానికి ఇందులో ప్రమేయం వుందో లేదో! లేదని మాత్రం తెగేసి చెప్పలేం. వుంటే ఎప్పటికైనా బైటపడక మానదు. ఎందుకంటే తప్పుని ఎక్కువ కాలం కప్పిపుచ్చ లేం.పైగా ఇన్ని చావుల తర్వాత ఇది సామాన్యమైన స్కామ్‌గా భావించలేం. అధికారంలో వున్న పెద్దల తలకాయలు వున్నందునే వారి పేర్లు బైటికి రాకుండా వ్యాపమ్‌తో సంబంధం వున్న వారిని పైకి పంపిస్తు న్నారన్నది అందరికీ వినిపించే అజ్ఞాత స్వరం. 
                  మనకు స్కాములు కొత్త కాదు. కుంభకోణాలు తెలియనివి కాదు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో జరిగిన స్కాముల్లో అతి పెద్దది 2జి. సెన్సేషన్‌ సృష్టించిన స్కామ్‌ కూడా అదే. అంతకు మించిన కుంభకోణం వ్యాపమ్‌. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రి ఒకరు జైల్లో వున్నారు. ఉన్నతాధికారుల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రతిపక్షాల గగ్గోలు పెడుతుంటే భరించలేక కేసును సి.బి.ఐకి అప్పగించమనడంతోనే ముఖ్యమంత్రి చౌహాన్‌ తనను తాను నిష్కళంకితుడిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దర్యాప్తులు జరిగాక కదా తెలిసేది. ఎవరెవరి పాత్ర ఏమిటో? ఎవరెవరు ఎంత బొక్కారో? బైటపడేది. అన్నట్టు వ్యాపమ్‌ సొమ్ముతో బి.జె.పి ,ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు విమానాల్లో షికార్లు చేశారన్నది తాజాగా వెలుగులోకి వచ్చిన వాస్తవం.
అబద్దాల చదువులు
             సాదా సీదా జనం అబద్ధాలు చెప్పారంటే... తిండికి లేకో, తాత్కాలిక ప్రయోజనాల కోసమో కక్కుర్తి పడ్డారనుకోవచ్చు. కానీ కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా గౌరవనీయమైన పదవుల్లో వున్న వారే తమ చదువుల గురించి అబద్ధాలు చెప్తే! పలు సందర్భాల్లో రకరకాల చదువులను పేర్కొంటే! నకిలీ సర్టిఫికెట్లతో ఇటు ప్రజలను, అటు రాజ్యాంగాన్ని మోసం చేస్తుంటే! ఏ మాత్రం ఉపేక్షించకుండా బుద్ధి చెప్పాల్సిందే! నరేంద్రమోడీ గారి మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలిగా వెలుగొందుతున్న మానవ వనరుల శాఖామంత్రి, టీవీ నటి స్మృతి ఇరానీ అదే పని చేశారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లో దూర విద్య ద్వారా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి (1996లో) ఆర్ట్స్‌ డిగ్రీ చేసినట్టు పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికలప్పుడు అదే యూనివర్సిటీ నుంచి (అదే సంవత్సరం) కామర్స్‌ డిగ్రీ చేసినట్టు అఫిడవిట్‌లో రాసిచ్చారు. ఒకే సంవత్సరం రెండు రకాల డిగ్రీల ను ఎలా చేశారనేది మినిస్టర్‌ మేడమ్‌ సెలవివ్వాలి. 
మహారాష్ట్రలో ఏకంగా విద్యాశాఖా మంత్రిగారే నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణల్లో కూరుకుపోయారు. బి.జె.పి ప్రభుత్వంలో మంత్రిగా వున్న వినోద్‌ తావ్దే ఊరూ పేరు లేని విద్యా సంస్థలో ఇంజనీరింగ్‌ చదివారట. పైసలిస్తే చాలు. కోరుకున్న డిగ్రీ పట్టా ఇచ్చే నకిలీ విద్యాలయాలకేం కొదవు లేదు. అలాంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ సంపాదించిన ఈయన గారు పాఠశాల, ఉన్నత విద్యనభ్యసించే భావి భారత పౌరుల జీవితాలను తీర్చిదిద్దే విద్యా విధానాలను రూపొందిస్తారట. 
                  బీహార్‌లో బీజేపీ సీనియర్‌ నేత, కాలం కలిసొస్తే కాబోయే ముఖ్యమంత్రి అయిన సుశీల్‌ కుమార్‌ మోడీగారి భార్యామణి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి లెక్చరర్‌ పోస్టు సంపాదించుకున్నారు. 1990ల్లో జరిగిన లెక్చరర్‌ స్కామ్‌లో భాగమైన అక్రమ నియామ కాలకు ఇదో మచ్చు తునక మాత్రమే. మోడీ సేనలో ఒకరైన మానవ వనరుల శాఖా మంత్రి రామ్‌ శంకర్‌ కఠేరియా సైతం నకిలీ పట్టాల ఆరోపణల్లో పీకల దాకా కూరుకుపోయారు. ఫోర్జరీ చేసిన మార్కుల షీటుతో సార్‌ ఏకంగా కేంద్ర మంత్రివర్గం లోకి వచ్చేశారు. ఇప్పటికి బైటపడిన అబద్ధాల చదు వుల రాయుళ్లు వీరు. ఇంక బైటికి రాని నకిలీ సర్టిఫికెట్ల రాకెటర్లు ఎందరున్నారో! మోడీ గారికే ఎరుక!
'మహా' స్కాములు
                  కమలనాథుల ఏలుబడిలో వున్న మహారాష్ట్ర స్కాముల గోలతో మార్మోగిపోతోంది. వినోద్‌ తావ్దే నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వంతో తల బొప్పి కట్టిన బి.జె.పి నేతలను చిక్కీల స్కామ్‌ కూడా తుగులుకోవడంతో ఉక్కిరిబిక్కిరై పోతున్నారు. బిజెపి సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండే కుమార్తె పంకజా ముండే. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఈమె ప్రస్తుతం రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖా మంత్రిగా వున్నారు. పాఠశాల విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించిన 206 కోట్ల రూపాయల స్కామ్‌లో కూరుకుని ఊపిరాడక అల్లాడుతున్నారు. వేరుశనగ పప్పు, బెల్లంతో చేసిన తీపి పదార్థం చిక్కీ (పప్పు చెక్క), ఇతర పుస్తకాలు, చాపలు, మంచినీళ్ల ఫిల్టర్ల కొనుగోలుకు సంబంధించిన కొనుగోళ్లలో భారీ అవకతవకలకు కారణమయ్యారు పంకజ. ఐసిడిఎస్‌ పథకం కింద గిరిజన చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో చిక్కీ కూడా ఇస్తుంటారు. అలాంటి బీద పిల్లలకు అందించే వస్తువుల కొనుగోళ్లను హడావిడిగా ఆఖరి నిముషంలో టెండర్లను పిలవకుండా కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీటికి సంబంధించి ఒకే రోజు 24 ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 లక్షల రూపాయలకు పైన ఏదైనా కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఈ-టెండర్లను పిలవాలి. అదేం లేకుండా ఆశ్రితులకు కాంట్రాక్టులు అంటగట్టేసి చవకబారు, నకిలీ వస్తువులను పుచ్చుకున్నారు. బీద పిల్లల నోటికాడి చిక్కీ, చదువుకునే పుస్తకాలు, వాడుకునే వస్తువుల విషయంలోనే దయాదాక్షిణ్యాలు లేకుండా 
అవకతవకలకు పాల్పడ్డారంటే ఏమనుకోవాలి? 
                 ఇక విద్యా మంత్రి వినోద్‌ తావ్దే నకిలీ విద్యా సర్టిఫికెట్లతోనే సరిపుచ్చుకోలేదు! స్కూళ్లలో ఉపయోగించే అగ్నిమాపకాల కొనుగోళ్లలో అవకతవకలకూ కారణమయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్‌ స్కూళ్ల్లలో అగ్నిమాపకాలను ఇష్టమొచ్చిన రీతిలో కొనేశారు. పంకజా ముండే మాదిరిగానే ఈయనగారు కూడా టెండర్ల ఊసే మర్చిపోయారు. 191 కోట్ల రూపాయల కాంట్రా క్టును ఆశ్రితులకు అప్పణంగా అందించారు. అదేమ ంటే మంత్రులిద్దరూ చేసిన తప్పు కప్పి పుచ్చుకోవ డానికి వంకలు, సాకులు వెతుకుతున్నారేకానీ జరిగిన తప్పిదాన్ని గుర్తించి ఒప్పుకోవడం లేదు. ఆఖరికి వీరి దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవిస్‌ సైతం స్కాము కింగులు, క్వీన్లను వెనకేసుకొస్తున్నారు. అంతకు మించి వీరిని సరిదిద్దడానికిగాని, మరెక్కడా ఇలాంటి అవకతవకలు జరగకుండా వుండేందుకు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచిత్రం.
ఉత్తుత్తి మాటలేనా! 
             దేశంలోనే కాదు. విదేశాల్లోనూ మోడీ గారిది ఒకటే మాట. తమది భిన్నమైన పార్టీ అట. స్వచ్ఛమైన పార్టీ అట. కళంకితులు లేని పార్టీ అట. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పలికిన చిలక పలుకులు ఇవే. అవినీతి అంటే ఏంటో తెలీనట్టు, స్కాముల స్పెల్లింగు తెలీదన్నట్టు మాట్లాడారు. వీలైన చోటల్లా చూపుడు వేలు చూయించి మరీ 'న ఖానూగా, న ఖానే దూంగా' (నేను తినను, మరొకరిని తిననివ్వను) అని ఉద్ఘాటించారు. మరి బార్లా తెరచుకొన్న మోడీ గేట్లు, సుష్మా-రాజేల నేరారోపణలు, వ్యాపమ్‌ పాపాలు, వందల కోట్ల రూపాయల అవకతవకల గురించి ఏం చెప్తారు? లమో విషయంలో నమో ఎందుకు మౌనంగా వుంటున్నారు? అత్యంత ఉన్నత పదవిలో వున్నాక మౌనంగా వుంటే కుదరదు కదా. ప్రజలకు జవాబుదారీగా వుండొద్దూ? వీటన్నిటికీ నరేంద్రమోడీగారు సమాధానం చెప్పాలి. అవినీతితో ఆశ్రిత పక్షపాతంతో అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కేంద్ర మంత్రులు,రాష్ట్ర ముఖ్యమంత్రులని మిన్నకుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? సదరు పెద్దలను వెంటనే పదవులనుంచి తప్పించొద్దూ! దర్యాప్తుల్లో వాస్తవాలు వెల్లడయ్యాకే వారిని తిరిగి గద్దెనెక్కించాలో లేదో ఆలోచించుకోవడం ఉత్తముల లక్షణం. లేకుంటే ప్రధాని మోడీ గారిపైనా దేశ ప్రజలు అనుమానం కలిగినా ఆశ్చర్యం లేదు! 

- కె. అంజన