ప్రజా సమస్యలపై సిపిఎం చేపట్టిన ప్రచారాందోళనల్లో భాగంగా బుధవారం తెనాలి జిల్లా వైద్యశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం బాధ్యత తీసుకుని రాజధాని వైద్యశాలగా అప్‌గ్రేడ్ చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ ఈశ్వర ప్రసాద్‌తోనూ, రోగులతోనూ మాట్లాడి వైద్యసేవలపై వివరాలు సేకరించారు. 10 లక్షల మంది ఈ ఆస్పత్రిపై ఆధారపడ్డా అందుకనుగుణంగా సదుపాయాల్లేవన్నారు. డాక్టర్ల కొరతతోపాటు దోభీ, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఆస్పత్రికి ఆర్‌టిసి లోకల్ సర్వీసులు తిప్పాలని,కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలనూ పెంచాలని డిమాండ్ చేశారు.