దళితులపై దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర సదస్సు

రాష్ట్రంలో దళితులపై పలు విధాలుగా జరుగుతున్న దాడులు, కులవివక్ష, దళితుల భూముల్ని లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పది వామపక్షాలు రాష్ట్ర సదస్సు నిర్వహించాయి. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లి తదితర గ్రామాల్లో అనేక దశాబ్దాలుగా సాగు చేస్తున్న దళితుల భూముల్ని 'నీరు-చెట్టు' పేరుతో ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం, పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రులో దళితులపై గత మూడు నెలలుగా సాంఘిక బహిష్క రణ చేయడం, చిత్తూరు జిల్లాలో మహాభారతం పేరుతో సాగే ఉత్సవాల్లో దళితుల పట్ల వివక్ష కనబర్చడం వంటి చర్యలపై ఈ సదస్సులో చర్చించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఇతర వామపక్ష పార్టీల నాయకులు సదస్సులో ప్రసంగించారు.