
144 సెక్షన్ పేరుతో రాజధాని ప్రాంతంలో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపుతున్న ప్రభుత్వ పోకడను సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం మంగళగిరిలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎంఆర్‌పిఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం అప్రజాస్వామికమని సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం.రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్‌పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణను, కోస్తా జిల్లాల కన్వీనర్ మల్లవరపు నాగయ్య తదితర నాయకులను పోలీస్ స్టేషన్‌లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాజధానిలో దళితులు, పేదలు హక్కుల గురించి మాట్లాడుతుంటే చట్టాల పేరుతో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.