
బందరుపోర్టు, పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లోనే నిర్మించాలని కోరుతూ కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలో శనివారం జరిగిన 'మీ ఇంటికి...మీ భూమి కార్యక్రమంలో అరెస్ట్ చేసిన భూపరిరక్షణ కమిటీ కన్వీనర్ కొడాలి శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చౌటపల్లి రవి, పోతేపల్లి ఎంపిటిసి పిప్పళ్ళ నాగేంద్రబాబులు బెయిల్‌పై మచిలీపట్నం స్పెషల్ సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. ఎక్సైజ్ శాఖ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కృష్ణాజిల్లా బందరు మాజీ శాసనసభ్యులు, వైసిపి నాయకుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)కి బుధవారం బెయిల్ లభించింది.