
దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ విశ్వ విద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాను యుజిసి తన వెబ్‌సైట్లో ఉంచింది. రాష్ట్రాల వారీగా 21 నకిలీ విశ్వవిద్యాలయాల పేర్లను ప్రకటించింది. అత్యధిక సంఖ్యలో నకిలీ విశ్వవిద్యాలయాలున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ (8) నిలిచింది. తర్వాతి స్థానంలో ఆరు నకిలీ విశ్వవిద్యాలయాలతో ఢిల్లీ స్థానం పొందింది. అయితే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పిన వర్సిటీలను, ప్రాదేశిక చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన వర్సిటీలను, లేదా యుజిసి చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం నెలకొల్పిన డీమ్డ్ యూనివర్సీటీలను మాత్రమే విశ్వ విద్యాలయాలుగా పరిగణించాలని యుజిసి తెలిపింది. ఇవి మినహా ఏ విద్యా సంస్థలకూ యూని వర్సిటీలుగా చెప్పుకునేందుకు అనుమతి లేదని, వాటికి, ఆ సంస్థలు జారీ చేసే డిగ్రీలకు గుర్తింపు ఉండదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని యుజిసి తెలిపింది.
నకిలీ విశ్వవిద్యాలయాలు ఇవే
మైథిలి విశ్వవిద్యాలయం (దర్బాంగ్).,ఢిల్లీ : వరన్‌సేయ సంస్కృత విశ్వ విద్యాలయ, కమర్షియల్, యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఒకేషనల్ యూనివర్సిటీ, ఏడిఆర్ సెంట్రిక్ జ్యుడిషియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్., కర్నాటక : బదగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యూకేషన్ సొసైటీ (బెల్గాం)., కేరళ : సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం (కిషన్ పట్టం).,మధ్యప్రదేశ్ : కేసరవాణి విద్యాపీఠ్ (జలం ధర్)., మహారాష్ట్ర : రాజా అరబిక్ విశ్వవిద్యాలయం (నాగపుర్)., తమిళనాడు : డిడిబి సంస్క ృత విశ్వవిద్యాలయం (తిరుచ్చి)., పశ్చిమ బెంగాల్ : ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (కొల్‌కతా)., ఉత్తరప్రదేశ్ : మహిళా గ్రామ విద్యాపీఠ్ (అలహా బాద్), గాంధీ హిందీ విద్యాపీఠ్ (అలహాబాద్), ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి జాతీయ విశ్వ విద్యాలయం (కాన్పూర్), నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (అలీగఢ్), ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యా లయ, మహారాణా ప్రతాప్ శిక్షానికేతన్ విశ్వవిద్యా లయం (ప్రతాప్‌గఢ్), ఇంద్ర ప్రస్థ శిక్ష పరిషత్ (నోయిడా), గురుకుల్ విశ్వ విద్యాలయ (మధుర).