
కాకినాడ సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను జడ్‌పి ఛైర్మన్ నామన రాంబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడంతోపాటు సమాజ మార్పునకు పుస్తక పఠనం దోహదం పడుతుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ 'నేను మలాలా' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.