ప్రభుత్వ విధానాలతో భారమౌతోన్న విద్య

సమాజాభివృద్ధికి, మానవ వికాసానికి చోదకశక్తి విద్య. విద్యా విధానాలే ఆయా దేశా పురోభివృద్ధికి సంకేతాలుగా వున్నాయి. అత్యధిక జనాభాగ చైనా అయినా, చిన్న దేశం ఫిన్‌లాండ్‌ అయినా అదే సందేశం ఇస్తున్నాయి.మన దేశంలో స్వాతంత్య్రం వచ్చి 68 యేళ్ళు గడిచినా అక్షరాస్యత 74%గా ఉంది. మన రాష్ట్రంలో చూస్తే అక్షరాస్యత 67% మాత్రమే ఉంది.  స్త్రీలో 59.74%. 2011 సర్వే ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అక్షరాస్యత 40% లోపు ఉన్న మండలాలు 215 కాగా 40 నుంచి 55% లోపు ఉన్న మండలాలు 165 వున్నవి. 55%లోపు అక్షరాస్యత వున్న మండలాలు 383. అంటే ఉమ్మడి రాష్ట్రంలో 3వ వంతు మండలాలు అక్షరాస్యతలో రాష్ట్ర సగటుకన్నా వెనుకబడి వుండగా కర్నూులు జిల్లా అత్యంత వెనుకబడి వున్నది. ఈ గణాంకాలు మన పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనాలు.