ఈ రోజు సిపియం ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లడుతున్న జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.రమేష్ పాల్గొన్నారు.....
- 2000 సంవత్సరంలో టిఎసిలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా తీర్మానం చేసినది తెలుగుదేశం ప్రభుత్వం కాదా?
- 1997లో దుబాల్ కంపెనీతో ఒప్పందాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా?
- కాంగ్రెస్ అధికారంలో వుండగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు బాక్సైట్ తవ్వకాలు రద్దు చేయాలని కోరినా ఎందుకు రద్దు చేయలేదు?
- ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడంలేదు?
- 2007-08లో రస్ఆల్-ఖైమాతో జరిగిన ఒప్పాంలు తప్పులతడకని కాగ్ నివేదికపై తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం ఏమిటి?
- గిరిజనుల మనోభావాల కన్నా కంపెనీల మనోభావాలకు ప్రాధాన్యతిస్తున్న చంద్రబాబు.
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనమంతా ఐక్యంగా పోరాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొండిగా తవ్వకాల జరపాలని చూస్తున్నది. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, కేంద్రంలోని బిజెపి పార్టీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎ.పి.ఎం.డి.సి.)కి లీజు అనుమతులు కట్టబెడుతూ ఇచ్చిన 97 జీవోను రద్దుచేయాలని, బాక్సైట్ తవ్వకాలు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని గిరిజనలు పోరాడుతుంటే, చంద్రబాబు మాత్రం గత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో జారీ చేసిన జి.వో.నెం. 222ను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేసి చంద్రబాబు దొంగనాటకాన్ని బయటపెట్టుకున్నారు.
అధికారం కోసం బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల కోసం తహతహలాడుతున్నారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన జి.వో.ను రద్దు చేసి, ఇప్పుడు చంద్రబాబు కొత్త జి.వో., కొత్త ఒప్పందాలు చేసుకుని అధికార పార్టీ అనుయాయులకు కట్టబెట్టడడం కోసమేనని తేటత్లెమౌతున్నది! గిరిజనుల మనోభావాలు, బ్రతుకుకంటే కార్పొటే కంపెనీలకు లాభాలు చేకూర్చడమే చంద్రబాబు విధానంగా ఉన్నది. ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం ప్రజల జీవితాలను, పర్యావరణాన్ని నాశనం చేయబూనుకోవడం క్షంతవ్యం కాదు. బాక్సైట్ తవ్వకాలను ముక్తకంఠంతో గిరిజనులు వ్యతిరేకిస్తున్నా ఎలాగైనా బాక్సైట్‌ను తవ్వి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ఉద్ధేశంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులేస్తున్నది.
బాక్సైట్ మైనింగ్ జరిగితేనే అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. కానీ ఎవరి అభివృద్ధికి ఉపయోగపడుతుందనేది ముఖ్యం? విదేశీ కంపెనీ లాభాలకు, అధికారంలో ఉన్నవారికి ఇచ్చే కమీషన్లుతో టిడిపి నాయకుల అభివృద్ధి జరుగుతుందితప్పా ఇక్కడ ప్రజలకు బూడిదే మిగులుతుంది! అంతేకాకుండా ఎ.పి.ఎం.డి.సి కి 1.5 శాతం మాత్రమే ఈక్విటీ ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం 98.5 శాతం ప్రైవేట్ వారికి అప్పగించారు. మిగిలిన దాంట్లో 0.5 శాతం ఆదాయాన్ని గిరిజనుల ఆరోగ్యం, విద్య, శిక్షణా వగైరాలకు ఖర్చు చేస్తామని ఈ ఎం.ఓ.యు.లో పేర్కొన్నారు. కానీ గిరిజనులకు ఆదాయాల్లో వాటాలిస్తామని చేసే ప్రచారం పచ్చి బూటకం. 20 సం॥ రా క్రితం బొర్రా గుహ ఆధునీకరణ సందర్భంగా 10 శాతం ఆదాయాన్ని గిరిజనులకు ఖర్చు చేస్తామన్న జి.వో.ను నేటికీ అమలు చేయడంలేదు. టూరిజంలో వచ్చే ఉద్యోగాలన్నీ గిరిజనులకే ఇస్తామనిచెప్పినా ఎక్కడా అమలు కాలేదు. అభివృద్ది పేరుతో చేసే ఈ ఆగడాలను గిరిజనులు నమ్మె పరస్థితిలో లేరనేది చంద్రబాబు ప్రభుత్వం గమనించాలి.
గత రెండు దశాబ్ధాలుగా బాక్సైట్ పై పాలకులు చేస్తున్న ప్రయత్నాలను సిపిఎం పార్టీ గిరిజనుల పోరాటాల ద్వారా తిప్పికొడుతున్నది. బాక్సైట్ పై సుదీర్ఘంగా రాజీలేని పోరాటం నిర్వహిస్తున్నది. 11 గిరిజన మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించి ఆందోళనను కొనసాగిస్తున్నది. గిరిజన ప్రజలు ఇప్పటికే కరువు, విషజ్వరాతో, పోషకాహార లోపాలతో జీవిస్తున్నారు. గిరిజనుల అభివృద్ధికోసం నిధులు కేటాయింపు తగ్గించి గిరిజనుల జీవితాలకు కనీసం ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే మంచినీళ్లు, కరెంటు సౌకర్యం, విద్య, వైద్యం లేని గిరిజనల ప్రాంతాలు ఈ తవ్వకావల్ల మరింత ఘోరంగా తయారవుతాయి.
బాక్సైట్ జోలికొస్తే ఊరుకోమని, మోసం చేస్తున్న పాలకులకు గిరిజనులు బుద్ది చెప్పాలి. వామపక్షాల పోరాటం, వత్తిడితో వచ్చిన అటవీ హక్కుల చట్టం`2006 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు సాగుచేస్తున్న భూములన్నింటికీ, బాక్సైట్ ప్రభావిత ప్రాంతాల్లో అటవీ భూములపై పట్టాల సాథనకు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది.