మైనార్టీలపై మానసిక యుద్ధం

ఎల్‌కె అద్వానీ 2002లో తన రథయాత్ర ద్వారా కాషాయ శక్తులను పునరేకీక రించి డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును విధ్వంసం చేయించ టం ద్వారా దేశ లౌకికవాదాన్ని అపహాస్యం చేశారు. దాని ఫలితాన్ని వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు అనుభవిస్తుండటం వేరే విషయం అయినప్పటికీ, బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి తప్పించుకోవడం ద్వారా ప్రజా స్వామ్యాన్ని పరిహాసం చేశారు. ఆ క్రమాన్ని గుజరాత్‌లో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లిన మోడీ పరివారం ఇప్పుడు ఉత్త ర ప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా అసలు ప్రజా స్వామ్యం మనుగడనే సహించలేమన్నట్టుగా వ్యవ హరిస్తుండటం అత్యంత విచారకర అంశం. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మరింతగా మత ఉద్రిక్తతలను, కల్లోలాలను సృష్టించటం ద్వారా ప్రజల మధ్య మరింత స్పష్టమైన విభజన రేఖ గీయటం లక్ష్యంగా ఇప్పుడు బిజెపి పరివర్తన రథ యాత్రను నిర్వహిస్తున్నది. యుపిలో ఈ ఎన్నికల్లో చంపో, చంపించో..ఎట్లాగైనా సరే పీఠం దక్కించుకోవాలనే యావ లో బిజెపి చాలా వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం అక్కడ సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న కీచులాటలను సాకల్యంగా మలచుకోవడానికి కూడా బిజెపి వెనుకాడడం లేదు. అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తాననడం, రామాయణ మ్యూజియం పేరుతో రామాయణ కథలోని పాత్రలను కులాలవారీగా విభజించి, ఆయా కులాల ప్రజల్లో బిజెపి పట్ల సానుకూలత కల్పించుకోవటం ఒకెత్తయితే, ప్రత్యేకంగా యుపిలో ముస్లింలను ప్రభావితం చేయగల్గిన అన్ని రాజకీయ పార్టీల్లోని ముస్లిం నేతలను బెదిరించటం లక్ష్యంగా తీవ్రంగా పనిచేస్తున్నారు. తద్వారా ముస్లింలను భయభ్రాంతులకు గురి చేసి, 'ముజఫర్‌ నగర్‌'ను అప్పుడే మర్చిపోయారా అన్న వికృత క్రీడను ఆడుతున్నారు. ఇలా ముప్పేట దాడి లక్ష్యంగా ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధినాయక గణం పరివర్తన రథయాత్ర చేస్తున్నది. 
యుపిలో మీరట్‌ సమీపంలోని కైరానా ప్రాంతంలో నవంబర్‌ 6న ప్రారంభమైన ఈ పరివర్తన రథయాత్ర నాలుగు విడతలుగా జరగనుంది. నాలుగు యాత్రలను కున్నవి మరిన్ని అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. షహరాన్‌పూర్‌, ఝాన్సీ, సంభద్ర, బల్దియాల నుంచి వేర్వేరు స్థాయిల్లో మొత్తం కేంద్ర మంత్రులందరూ షెడ్యూల్‌వారీగా పాల్గొని ఉద్రిక్తపూరిత ఉపన్యాసాలిచ్చేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పథక రచన చేశారు. దీనికి ఆరంభం ఆయనే చేశారు. వర్తమాన భారత రాజకీయాల్లో అత్యంత దుందుడుకు వ్యాఖ్యల కరసేవకుడిగా అమిత్‌ షా తన వంతు పాత్రను యుపిలో నిర్విఘ్నంగా చేసే కార్యాచరణలో వేగంగా ఉన్నారు. పరివర్తన రథ యాత్రలు డిసెంబర్‌ 25 వరకు కొనసాగించటం, ఈ లోపు మొత్తం మైనార్టీ వర్గాలపై మానసిక యుద్ధం చేయటం లక్ష్యంగా ఆయన ఉపన్యాసాల పరంపర కొనసాగనున్నది.
డిసెంబర్‌ 25 వాజ్‌పేయి పుట్టిన రోజున నిర్వహించే భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేశారు. బిజెపి నేతలు తమ ఉపన్యాసాల్లో బుందేల్‌ఖండ్‌లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌ను నిలుపు దల చేస్తామంటున్నారు. బుందేల్‌ఖండ్‌ రాష్ట్ర డిమాండ్‌ను పరిశీలిస్తామంటున్నారు. గ్యాంగ్‌స్టర్లు, అవినీతి లేని రాష్ట్రంగా చేసి అభివృద్ధితో తీర్చిదిద్దుతామని షా ఉపన్యాసాలు దంచుతున్నారు. ఎస్పీలో ప్రాధాన్యమున్న నాయకుడు అజంఖాన్‌, బిఎస్పీలోని నజీముద్దీన్‌ లక్ష్యంగా అమిత్‌ షా విమర్శలు చేయడం ద్వారా ప్రత్యేకంగా ముస్లిం నాయకులపై మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. తద్వారా ముస్లిం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే లక్ష్యంతో ప్రయాణిస్తున్నారు. యుపిని ఒక సాంస్కృతిక కేంద్రానికి నిర్వచనంగా కూడా బిజెపి మారుస్తుందంటున్నారు.
నిజానికి ఈ యాత్రలకు ముందే దసరా నాడే తమ ఉపన్యాసాల ద్వారా అటు మోడీ, ఇటు షా తాము ఆడాల్సిన మైండ్‌గేమ్‌కు ప్రణాళిక సంసిద్ధం చేసుకున్నారు. యుపి ఎన్నికలను పురస్కరించుకునే అక్కడి పర్యాటక ఉద్ధరణ పేరుతో మరింతగా మత ఉద్రిక్తతలకు వేదికగా ఎన్నికలను ఉపయోగించుకోవాలనుకున్నారు. రామ్‌లీలా మైదానంలో దసరానాడు జై శ్రీరామ్‌ నినాదంతో ఉపన్యాసం ప్రారంభించిన మోడీ, సరిగ్గా అదే రోజు వివాదాస్పద అయోధ్యలో కేంద్ర టూరిజం శాఖా మంత్రి మహేష్‌శర్మ రామ్‌లల్లా గుడి వద్ద సమావేశం నిర్వహింపజేయటం ద్వారా అయోధ్య రామాలయం పేరుతో యుపి పీఠం దక్కించు కోవాలన్నది వారి ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ఆచరణలో భాగంగానే రామాయణ మ్యూజియంకు 25 ఎకరాలు కేటాయించటం, అంతర్జాతీయ రామాయణ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం. ఈ క్రమంలో మరింత ముందుచూపుతో బౌద్ధ సర్క్యూట్‌, రామాయణ సర్క్యూట్‌, కృష్ణా సర్కూట్‌లు ప్రకటించేశారు. ఇందులో రామాయణ సర్క్యూట్‌కు రూ.225 కోట్లు కేటాయించడం, ఒక్క అయోధ్యకే రూ.151 కోట్లు కేటాయించటం ఒకెత్తయితే, చిత్రకూట్‌కు రూ.51 కోట్లు, శ్రీరంగవేపూర్‌లోని పూల్పూర్‌కు రూ.23 కోట్లు కేటాయించి మంజూరు చేస్తామని అనటం మరో ఎత్తుగడ. నిజానికి చిత్రకూట్‌ కథ వాల్మీకి రామాయణంలో లేదు. గోస్వామి తులసీదాస్‌ రాసిన రామచరిత మానస్‌లో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త నానాజీ దేశ్‌ముఖ్‌ రామచరిత మానస్‌ను తమ కార్యవాV్‌ాలకు బోధించటం ద్వారా ఆయన నేతృత్వంలో తొలుత చిత్రకూట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడే పండిట్‌ దీనదయాళ్‌ పరిశోధనా కేంద్రాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఇది సెంటర్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో కొనసాగుతున్నది. శ్రీరంగ వేపూర్‌ ప్రస్తావన రామచరిత మానస్‌లో ఉంటుంది. ఇది నిషాద దేశ రాజు రాజధాని. ఇతడు మత్స్యకార కుటుంబానికి చెందిన వాడు. శ్రీరాముడిని సరయూనది దాటించటానికి ఇతడు సాయం చేశాడనేది కథ. అయితే, ఆ ప్రాంతంలో మత్స్యకార కుటుంబాలు పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నారు. ఈ క్రమంలోనే మత్స్యకార కులానికి చెందిన ఓట్లను కొల్లగొట్టడంలో భాగంగానే పూల్పూర్‌ అనే ఓ చిన్న ప్రాంతానికి రూ.23 కోట్లు అభివృద్ధి కోసం అన్నట్టుగా కేటాయించారు. ఈ మొత్తం తతంగాన్ని చూసి యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌ తాను నవంబర్‌ 5 నుంచి చెయ్యాలనుకున్న సమాజ్‌వాదీ వికాస్‌ రథయాత్రను రద్దు చేసుకున్నారు. ఇలా ములాయం కుటుంబ కలహాలు ఓ వైపు ఆ పార్టీలో రాజకీయ అనిశ్చితిని కలిగిస్తుండగా, బిఎస్పీ మాయావతి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. అవసరమైతే, ఎస్పీతో ఎన్నికల ఒప్పందం పెట్టుకుని అయినా పాగా వేయాలన్నది బిజెపి వ్యూహం. ఇందుకోసమే యుపిలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవటానికి పరివర్తన రథయాత్రను చేస్తున్నది. మోడీ అధికారంలో ఉండగానే బిజెపిని దేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరింపజేయాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాల్లో ఒక భాగం. ఈ విస్తరణలో భాగంగానే కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బిజెపిని కుర్చీలో కూర్చోబెట్టేందుకు చేసే ప్రయత్నాలనూ ముమ్మరం చేశారు. అక్రమ మైనింగ్‌ కేసులో యడ్యూరప్ప మీద కొనసాగుతున్న సిబిఐ విచారణకు బ్రేక్‌ వేయించగలిగారు. సౌత్‌ వెస్ట్‌ మైనింగ్‌ కంపెనీ పేరుతో రూ.130.07 కోట్ల విలువ గల భూమిని తన అక్రమ మైనింగ్‌కు వినియోగించుకున్న కేసులో యడ్యూరప్ప సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దాన్ని నిలుపుదల చేయించారు. ఇంకోవైపు ఇలాగే ఒఎంసి అక్రమ మైనింగ్‌ కేసులో తన బెయిల్‌ కోసం కోట్లాది రూపాయలు ఎర వేసి న్యాయ వ్యవస్థనే గందరగోళానికి గురి చేసిన గాలి జనార్దనరెడ్డి తిరిగి రాష్ట్రానికి చేరాడు. ఇట్లా వారిద్దరికీ 'లీగల్‌ రిలీఫ్‌' ఇచ్చి పార్టీని కర్ణాటకలో తిరిగి అధి కారంలోకి తేవాలన్నది అమిత్‌ షా ఎత్తుగడ. ఇదే సందర్భంలో పంజాబ్‌ ఎన్నికల్లో కూడా తమ ప్రాభవాన్ని చాటు కోవాలనుకుంటున్నది. 
పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా గురుగోవింద్‌ సింగ్‌ చేసిన కృషిని మోడీ ప్రత్యేకంగా కొనియాడారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ను ప్రారంభిస్తున్నామని, దళితులు, ఆదివాసీల అభివృద్ధి మీద దృష్టి పెడతామని, వీరిని పెట్టుబడిదారులుగా చేసేందు కు స్టార్టప్‌ ఇండియా పేరుతో కొత్త పథకం ప్రవేశ పెడు తున్నా మని అంటున్నారు మోడీ. కానీ, వాస్తవంలో మాత్రం దళితులు, మైనార్టీలపై 'గోవు పథకం' కేసులు, విచారణలు లేని దాడులు చేయిస్తున్నారు. పరివర్తన అంటే మార్పు అని అందరూ అనుకునే వేళ కాషాయ శక్తులు లౌకికత్వం నుంచి కాషాయం వైపు పరివర్తన గా భావించి భయపెట్టి పాలనలోకి రావాలనుకుంటున్నారు. లౌకికవాదులు, ప్రజాస్వామ్య ప్రేమికులు అంతా ఒక్కటిగా ఉద్యమించి నేరస్తులు పాల కులుగా కాకుండా నివా రించ గలిగే క్రియాశీలతను ప్రదర్శిం చాల్సిన ముఖ్యమైన సందర్భం లో మనం ఉన్నామన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది..