
కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజాసంక్షేమం సహా అన్నింటా వైఫల్యం చెందిందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపి బృందాకరత్ అన్నారు. ఏడాది పాలనలో ప్రజలపై ఆర్ధికభారాలు మోపడం మినహా సాధించింది ఏమీ లేదని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు.గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం దేశంలోని మూడు రాష్ట్రాలు మినహా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ ఆహారభద్రతా బిల్లు ప్రకారం నిత్యవసరవస్తువుల్ని సరఫరా చేయట్లేదని తెలిపారు.