ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజకీయ ప్రత్యా మ్నాయం కోసం వామపక్షాలు చేపట్టిన మహాగర్జన కార్యక్రమం విజయవాడలో పెద్ద ఎత్తున జరుగుతోంది. బిఆర్టిఎస్ రోడ్డులో మధురానగర్ వద్ద ఇప్పటికే సభావేదికను సిద్ధం చేశారు. పలు జిల్లాల నుండి కార్యకర్తలు నగరానికి చేరుకున్నారు. అనంతపురం, చిత్తూరు నుండి రెండు ప్రత్యేక రైళ్లు బయలు దేరాయి. మహాగర్జన బహిరంగసభలో పాల్గొ నేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ నగరానికి చేరుకున్నారు.సభకు ముందు నగరంలో రెండు మహా ప్రదర్శనలు జరగనున్నాయి. రైల్వేస్టేషన్ నుండి సాంబమూర్తిరోడ్డు మీదుగా ఒక ప్రదర్శన, గుణదల ఇఎస్ఐ ఆస్పత్రి నుండి మరోప్రదర్శన ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నగరంలోని అన్ని కూడళ్లను ఎర్ర జెండాలతో అలంకరించారు. సభ ప్రారంభానికి ముందు, ప్రసంగాల అనంతరం పెద్దఎత్తున సాంస్కృతిక బృందాలు కళారూపాలు ప్రదర్శించనున్నాయి. 60 అడుగుల వెడల్పు, 32 అడుగల ఎత్తుతో వేదికను ఏర్పాటు చేస్తున్నారు.