విజయవాడ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా రక్షణ యాత్ర వాంబేకాలనీలో సాగింది. ఈ యాత్రను మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సిఎం చంద్రబాబు 90 వేల ఎకరాలను సేకరించారని, కానీ పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించడంలేదని అన్నారు. రాజధానికి సేకరించిన 90 వేల ఎకరాల్లో పది వేల ఎకరాలు ఇస్తే చాలని, రాజధాని ప్రాంతంలోని అర్హులైన పేదలందరికీ ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున స్థలం ఇవ్వొచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇళ్లస్థలాల సాధనకు ఐక్యంగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కలిసొచ్చే అన్ని పార్టీల మద్దతును కూడగడతామని చెప్పారు.