వ్యాపం లో మరో కోణం

వ్యాపం కుంభకోణాన్ని తానే తొలిసారిగా గుర్తించానని, ఆడ్మిషన్లు; రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని తెలిసిన వెంటనే దర్యాప్తుకు ఆదేశించానని గొప్పలు చెప్పుకుంటున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు వ్యతిరేకంగా దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అసలు దర్యాప్తు ఆలస్యానికి ముఖ్యమంత్రే కారణమని రికార్డులు చూపిస్తున్నాయి. కుంభకోణం సంగతి సిఎంకు ముందే తెలుసని, ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన దర్యాప్తును ఆలస్యం చేశారని రికార్డులు చూపిస్తున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఈ విషయాన్ని విపక్షాలు చర్చకు లేవనెత్తినపుడు సిఎం సమాధానాలతో తప్పించుకున్నారని, సుమారు 17 సార్లు విపక్ష సభ్యుల నుంచి దీనిపై సిఎంకు లేఖలు అందాయని రికార్డుల మూలంగా తెలుస్తోంది. 2011 జూలై, 2013 జూన్‌ మధ్యకాలంలో ఈ విషయంపై సిఎంకు విపక్షాల నుంచి 17 లేఖలు అందాయని తెలిపారు. దానిపై సిఎం స్పందిస్తూ 30 రోజుల్లోగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపిన ఆయన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తర్వాత చాలా సార్లు ప్రశ్నించినప్పటికి సిట్‌ బృందం విచారణ కొనసాగుతున్నందున ఎలాంటి వివరాలు బయటపెట్ట లేమని తెలిపినట్లు ఆప్‌ నేత చెప్పారు.