
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృ త్వంలోని ఎన్డీయే సర్కార్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. 2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులుగాఉన్న హిందూ తీవ్రవాదుల పట్ల మెతక వైఖరి అనుసరించాలని జాతీయ భద్రత సంస్థ (ఎన్‌ఐఎ) ఒత్తిడి తీసుకొ చ్చినట్లు ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూ టర్‌గా ఉన్న రోహిణి శాలియన్ చెప్పారు. ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించగా మరో 70 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. మోడీ సర్కార్ అధికార పగ్గాలను చేపట్టిన నాటి నుండే హిందూ తీవ్రవాదులపై మెతక వైఖరి అనుసరించాలన్న ఆదేశాలు ఎన్‌ఐఎ నుంచి పెరిగాయని ఆమె తెలిపారు. 'గతేడాది ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఎన్‌ఐఎ అధికారి ఒకరు నన్ను ఓ సారి కలవాల్సిందిగా ఫోన్ చేశారు. మాలేగావ్ కేసులో హిందూ తీవ్ర వాదుల పట్ల మెతక వైఖరి అనుసరించాలని చెప్పారు. అత్యున్నతస్థాయి అధికారులే ఈ సందే శాన్ని చేరవేయాల్సిందిగా చెప్పారని ఆయన అన్నారు' అని రోహిణి తెలిపారు. అలాగే ఈ ఏడాది జూన్ 12న మళ్లీ అదే అధికారి ఫోన్ చేసి తనను ఎస్‌పిపి నుంచి తప్పించనున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. దీంతో తాను పనిచేసిన రోజులకు బిల్లులు సెటిల్ చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కానీ బిల్లులు చెల్లించలేదని, తనను మార్చనున్నట్లు కూడా ఆదేశాలేవీ రాలేదని ఆమె చెప్పారు. అయితే తనకు ఈ ఆదేశాలు జారీ చేసిన ఎన్‌ఐఎ అధికారి పేరు వెల్లడించేందుకు మాత్రం రోహిణి నిరాకరించారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా 12 మంది అరెస్టు అయిన సంగతి తెలిసిందే. వీరిలో నలుగురికి బెయిల్ మంజూరైంది. మిగిలినవారు ఇంకా జైళ్లలోనే ఉన్నారు.