రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లో గడపనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ బస చేస్తారు. ఈ 14 రోజుల్లో ప్రణబ్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబర్ 19న సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు.