
ఈ రోజు సిపియం పార్టీ నాయకులు లాజిస్టిక్ హబ్ భూ సాగుదార్లు, జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌ను కలిసి నష్టపరిహారం విషయంలో సాగుదార్లుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యన్నారాయణ, గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఈ విషయంపై కలెక్టర్ స్పందించి భూ సాగుదార్లు అందరికీ చట్టం ప్రకారం రావల్సిన పరిహారాన్ని, బాధిత కుటుంబాలకు కూడా న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
‘‘లాజిస్టిక్ హబ్’’ కు మునగపాక, పరవాడ, అనకాపల్లి రూరల్ మండలాల్లోని (వెంకటాపురం, రామానాయుడుపేట, తానాం, తాడి, మ్లారు, ఎరుకువానిపాలెం, రాజుపాలెం, గొర్లివానిపాలెం) 8 గ్రామాల్లో సుమారు 486 ఎకరాల భూమును ప్రభుత్వం సేకరిస్తున్నది. రైతు, సాగుదార్లు తమ భూములు ఇవ్వడానికి అంగీకరించకపోయినా సర్వేచేసి, నష్టపరిహారం ప్రభుత్వమే నిర్ణయించి లిస్టు గ్రామాల్లో అంటించెస్తున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతు, సాగుదార్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ భూముల్లో ఉన్న సాగుదార్లంతా సన్న, చిన్నకారు రైతులు. పేదలు ఎక్కువగా వున్నారు. వీరికి ఈ భూములు తప్ప వేరే ఆధారం కూడా లేదు. ఈ భూములపై ఆధారపడే ఈ 8 గ్రామాల్లో కూలీలు, పేదలు జీవిస్తున్నారు. వీరు కూడా ఇప్పుడు నిరాశ్రయులవుతారు.
కావున ఈ క్రింది సమస్యలను పరిష్కరించి సాగుదార్లకు న్యాయం చేయాని కోరుతున్నాం.
1. లాజిస్టిక్ హాబ్ కోసం భూములు తీసుకుంటున్న 8 గ్రామాల ప్రజతో ఒకే ప్రపోజల్స్‌తో కాకుండా సర్వేనెంబర్లు, గ్రామా వారీగా అధికార్లు చర్చలుజరుపుతున్నారు. ఇది సమంజసం కాదు. అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవిధంగా సమస్యను పరిష్కరించాని కోరుతున్నాం.
2. 2013 భూ అధికరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. భూమిలో ఉన్న చెట్లు, ఇతర ఆస్థులకు సంబంధించి, నిర్వాసితులకు, ఇతర కూలీలకు ఉపాధి విషయంలో కూడా స్పష్టంగా వ్రాతపూర్వక హామీని ఇవ్వాలి.
3. అనకాపల్లి రూరల్ మండలం ఎరుకువానిపాలెం భూముల సర్వేలో అనేక మంది సాగుదార్ల వాస్తవ భూము కంటే తక్కువ చూపించారు. ఈ భూములను కాళీస్థలాలుగా చూపించారు. ఇక్కడ తేడా వచ్చిన సాగుదార్ల భూము కొలతలను రీ సర్వే చేయాలి.
4. ఎక్కువ భూమి, ఎక్కువ మంది సాగుదార్లు ఉన్న మునగపాక మండలం రామానాయుడు పేట గ్రామ సాగుదార్లతో అధికార్లు ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరపలేదు. వీరికి ఎటువంటి ప్రతిపాదను కూడా పంపలేదు.
పై సమస్యపై తమరు కుగజేసుకుని పరిష్కరించగరని కోరుతున్నాం.