
వివిధ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లకు సంబంధించి 14 ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఆమోదముద్ర వేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికంఠదాస్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఎఫ్‌డిఐలకు సంబంధించిన 23 ప్రతిపాదనలను పరిశీలించిన బోర్డు నాలుగు ప్రతిపాదనలను తిరస్కరించింది, ఐదింటిపై నిర్ణయం వాయిదా వేసింది. బోర్డు ఆమోదించిన ప్రతిపాదనల్లో శ్యామ్ సిస్టెమా టెలి సర్వీసెస్, ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ తదితర సంస్థలకు చెందిన ప్రతిపాదనలున్నాయి. రిలయన్స్ గ్లోబల్ కామ్, ఫైర్‌ఫ్లై నెట్‌వర్క్స్, అపోలో హాసి ్పటల్స్, ఎయిగాన్ రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతిపాదనలపై నిర్ణయాలను వాయిదా వేసింది.