అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అంగన్‌వాడీల ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 20 మంది అంగన్‌వాడీలు అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీకి మద్దతు తెలిపిన సిపిఎం, సిఐటియు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.