
ఏపీ సర్కార్ సీఆర్డీఏ చట్టాన్ని తాజాగా మళ్లీ సవరించింది. దీంతో ఇప్పటి వరకున్న 7068.20 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధి...ఇప్పుడు 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే అదనంగా 1,284.49 చదరపు కిలోమీటర్లు పెరిగింది.కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణం పూర్తిగా సీఆర్డీఏ లో కలిసింది. దీంతోపాటు వివిధ మండలాల్లోని 136 గ్రామాలను ఇందులో కలిపారు. గుంటూరు జిల్లాలోనూ 30 గ్రామాలు సీఆర్డీఏ లో అదనంగా కలిశాయి.