District News

బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం భూ బ్యాంకు పేరిట భూములను బలవంతంగా సేకరిస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అన్నారు. కడప జిల్లా బద్వేలు నియోజక వర్గంలో భూబ్యాంక్‌ కింద 36 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని తీసుకున్న గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఒక్క కడప జిల్లాలోనే భూ బ్యాంకు కోసం 1.23 లక్షల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందన్నారు. ఈ విధానాన్ని రైతులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేటర్లకు చౌకగా కట్టబెట్టేందుకే జిల్లాలో 33 మండలాల్లో పేదలు, రైతులకు చెందిన భూముల్ని సేకరిస్తోందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు పీడిత ప్రాంత మైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం  ఆధ్వర్యం లో  పెద్దఎత్తున కడప కలెక్టరేట్ను ముట్టడించారు.ధర్నాకు వస్తున్న ప్రజలనూ, పార్టీ కార్యకర్తలనూ, నాయకులనూ పోలీ సులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ధర్నానుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ..రాయలసీమలో విద్య, ఉపాధితోపాటు వర్షాలు లేక అన్నిట్లోనూ వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిషన్‌ తన రిపోర్టులో పేర్కొందని గుర్తు చేశారు. కడప జిల్లాకు రూ.50 కోట్లు ఇచ్చామని చెపుతున్నారని, ఈ మొత్తం పడిపోయిన స్కూల్‌ బిల్డింగులు రిపేరు చేయడానికి కూడా చాలవని విమర్శించారు. రాయలసీమ ప్రాంత సమ స్యల పరిష్కారం కోసం...

రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పేదల భూములు లాక్కొని కార్పొరేట్‌, బహుళజాతి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తే ఆందోళనలు తప్పవని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు హెచ్చరించారు. శుక్రవారం పాతబస్టాండ్‌లోని సిపిఎం కార్యాలయంలో 'భూ బ్యాంక్‌ బండారం-కార్పోరేట్లకు పందేరం' అనే పుస్తకాన్ని ఆవిష్క రించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఉన్న జిఒ నంబరు 120ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహమ్మద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌లో సర్కిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీ వైద్యకళాశాలలో సీమ విద్యార్థులకు 80శాతం, ఇతరులకు 20శాతం సీట్లు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం కొత్తగా జిఒ నంబరు 120 తీసుకు వచ్చి లోకల్‌కు 20శాతం, నాన్‌లోకల్‌కు 80శాతం సీట్లు కేటాంచే విధంగా అవకాశం కల్పించారని విమర్శించారు. రాష్ట్ర విభజనలో కోర్టు యాదావిధిగా కొనసాగించాలని చెప్పినా ప్రభుత్వం ధిక్కరించిందని తెలిపారు...

పేదల ఇళ్ళను తొలగించడానికి వస్తే ధైర్యంగా ఎదుర్కో వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పేదల ను కోరారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగస ముద్రం పంచాయతీలోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరు భూ ముల్లో బుధవారం వందలాది మంది పేదలు గుడిసెలు వేశా రు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సర్వే నెంబర్‌ 1263లోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరులో ఇంటి స్థలం కోసం పేదలు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిర్లక్ష్యం వహించారని, దీంతో ఓపిక నశించి ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డి మాండ్‌ చేశారు. ప్రతి కుటుంబానికీ రెండున్నర లక్షల రూపా యలతో పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలన్నారు...

ఉక్కఫ్యాక్టరీ తరలింపు నిర్ణయంపై సోమవారం కడప జిల్లాలో నిరసన వ్యక్తమైంది. సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. విమానాశ్రయం గేటు ఎక్కిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ష్ట్రంలో రోజు రోజుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు తారాస్థాయికి చేరుకుంటున్నా యి. కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దారు వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆయన అనుయాయుల దాడి, చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగళ్లు మహిళా తాహశీల్దారు నారాయ ణమ్మను ఓ సర్పంచ్‌ దుర్భాషలాడిన సంఘటనలు మరువక ముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఒంటిమిట్టలో తాగునీళ్లు అందడం లేదని నిలదీసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రభుత్వ విప్‌, రాజంపేట ఎమ్మెల్యే సాక్షిగా టిడిపి మండల అధ్యక్షుడు దాడిచేశాడు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నా ఈ సంఘటనను చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సోమశిల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే...

ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. బుధవారం కడపలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలం తక్కువగా ఉన్నప్పటికీ అధికారం, డబ్బు వినియోగించి ఎన్నికల్లో గెలవాలని టిడిపి యత్నిస్తోందన్నారు.
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ. 50 లక్షలు అప్పచెబుతూ టిడిపి కన్నంలో దొంగలా దొరికిందన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి పోరాటమూ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం...

Pages