District News

 

కర్నూలు:కోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ హాస్టల్‌లో విషాహారం తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్‌ అస్వస్థతకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

భారతదేశం గుర్తించిన రెండవ అధికార భాష అయిన ఉర్దూను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఇంగ్లీషు తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ఉర్దూ. కావున ఉర్దూనే మరింత అభివృద్ధి చేయాలి. అయితే ఉర్దూ భాష ఎక్కువగా ముస్లింలకే అనే ముద్రపడింది. కానీ ఉర్దూ అంతర్జాతీయ భాష. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం జపనీస్‌ భాషను కోర్సుగా పెట్టి నేర్పించాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇప్పటికే వాడుకలో ఉన్న ఉర్దూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. గతంలో ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉండేది. కానీ నేడు ముస్లిం సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఉర్దూ పాఠశాలలు అధికంగా ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు...

దేశ రాజకీయాలను అవినీతిమయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్‌ సంస్థల అధినేతల కాళ్లు రుద్దే పనిలో నేటి పాలకులు నిమగమయ్యారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. 'అవినీతి -కార్పొరేట్‌ రాజకీయాలు- ప్రత్యామ్నాయం' అనే అంశంపై సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సదస్సు జరిగింది. పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడుతూ రాజకీయాల్లోకి కార్పొరేట్‌ శక్తులు చొరబడిన తరువాత అవినీతికి అడ్డే లేకుండా పోయిందన్నారు. దీనిద్వారా చట్టసభల్లోకి వెళ్లి అక్కడ నుంచి వేల కోట్లు దోచుకోవడమేగాక సభలనూ నియంత్రిస్తున్నారని చెప్పారు. అటువంటి వారి కాళ్లు రుద్దేపనిలో ప్రస్తుత పాలకులు నిమగమై ఉన్నారని...

Pages