August

ఈనెల 30వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు

ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం నుండి ఈనెల 30వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు.

సెప్టెంబర్‌ 10, 11న జిల్లాకు సమగ్రాభివృద్ధి జాతా

రాష్ట్ర సమాగ్రాభివృద్ధి కోసం సిపిఎం, సిపిఐ చేపట్టిన జాతా సెప్టెంబర్‌ 10, 11న గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని, జాతాను విజయవంతం చేయాలని సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాతా వివరాలు వెల్లడించారు.

వాస్త‌వ సాగుదారుల‌కు, కౌలు రైతుల‌కు పంట న‌ష్ట‌ప‌రిహారం అందించాలి

వ‌ర‌ద‌ల వల్ల‌, క‌రువు ప్రాంతాల‌లో న‌ష్ట‌పోయిన వాస్త‌వ సాగుదారులు, కౌలు రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని సిపిఎం కేంద్ర‌క‌మిటి స‌భ్యులు వి. శ్రీ‌నివాస‌రావు అన్నారు. గుంటూరులో జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో క‌రువుల వ‌ల‌న, వర్షాల వ‌ల్ల సంభ‌వించిన వ‌ర‌ద‌లు వ‌ల్ల రైతాంగం తీవ్రంగా న‌ష్ట‌పోయార‌న్నారు. క‌రువు, వ‌ర‌ద‌ల వ‌ల‌న న‌ష్ట‌పోయిన వారిని ఆదుకోక‌పోతే వ్య‌వ‌సాయం గ‌ట్టెక్క‌దు. ముఖ్య‌మంత్రి వ‌ర‌ద‌ల ప్రాంతాల‌లో సంద‌ర్శించి రైతుల‌కు ఎక‌రానికి 10వేల రూపాయ‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కౌలు రైతుల గురించి ముఖ్యమంత్రి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం అన్యాయం అన్నారు.

కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జైల్ భరో

మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ విమర్శించారు. కేంద్ర కార్మిక, రైతాంగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు కర్నూల్లో జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా కార్మిక కర్షకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.ఈ సందర్భంగా పోలీసులు కార్మిక, రైతాంగ సంఘాల నాయకులను అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు పండించిన పంటలకు 50 శాతం అదనంగా మద్దతు ధర కల్పిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు.

Pages

Subscribe to RSS - August