ఇసుక సమస్య ను పరిష్కరించాలని, భవన నిర్మాణ కార్మికులకు భృతిగా నెలకు 10వేలు ఇవ్వాలని , ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ విజయవాడలో వామపక్ష పార్టీలు తలపెట్టిన ఇసుక మార్చ్ ను పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం వామపక్ష నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.